Gold Rate: కిందికి కదిలిన బంగారం ధరలు.. వెండి ధరలూ కిందికే! ఈరోజు ధరలిలా!!
Gold Rate: వరుసగా పెరుగుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు కాస్త కిందికి దిగాయి. నిన్నకొద్దిగా తగ్గిన వెండి ధరలు ఈరోజు మరింత తగ్గుదల కనబరిచాయి.
కొన్నిరోజులుగా పైకెగసిన బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 22) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (22.09.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 49,340 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 250 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,820 రూపాయలుగా నమోదు అయింది.
వెండి ధరలు కిందికి..
బంగారం ధరలు తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గాయి. ఈరోజు 900 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయల వద్ద నమోదు అయింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. మంగళవారం (22.09.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 49,340 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 250 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,820 రూపాయలుగా నమోదు అయింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 160 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 50,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 110 రూపాయలు తగ్గింది. దాంతో 54,760 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గాయి. ఈరోజు 900 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.