Gold Price Today: బంగారు నగలు కొనాలా ? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయంటే?
Gold Price Today: బంగారం ధరలు సెప్టెంబర్ 9 సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర 72,930 రూపాయలు పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 66,800 రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూసినట్లయితే స్వల్పంగా తగుముఖం పట్టినట్లు గమనించవచ్చు. నిన్నటి కన్నా బంగారం ధర 24 క్యారెట్ల పై 150 రూపాయలు తగ్గింది.

అయితే బంగారం ధర అంతర్జాతీయంగా కాస్త తగ్గుముఖం పట్టడం వలనే ఈ పరిణామం చోటు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం 2500 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా కూడా స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లలో మాత్రం నష్టాలు కొనసాగుతున్నాయి.
దీంతో భవిష్యత్తులో మాత్రం ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం వైపు తమ పెట్టుబడులను తరలించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో పసిడి ధరలు భవిష్యత్తులో అమెరికా మార్కెట్లో 2700 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందనే, వార్తలు ప్రస్తుతం చక్కెర కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు అతి త్వరలోనే 80,000 వరకు తాకిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అటు దేశీయంగా కూడా పలు కారణాలు చూడవచ్చు. ముఖ్యంగా దసరా దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపించడం అనేది సహజం .ఎందుకంటే సంవత్సరం మొత్తం లోను దసరా దీపావళి సందర్భంగా నే ఎక్కువగా బంగారం నగలు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తారు.
ఈ సీజన్లో ఫెస్టివల్ సీజన్ అని కూడా పిలుస్తారు ఈ సీజన్ డిసెంబర్ నెలఖరి వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలోనే ధన త్రయోదశి లాంటి పండగలు కూడా వస్తాయి ధన త్రయోదశి సందర్భంగా జనం తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు.
వీటన్నిటి నేపథ్యంలో ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 90 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్యలో బంగారం ధరలు అత్యధిక స్థాయిని ఈ సంవత్సరం చివరినాటికి నమోదు చేసే అవకాశం ఉందని కూడా బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు.