Gold Rate: స్థిరంగా బంగారం, వెండి ధరలు
Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate: దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 66, 700గా ఉంది. శనివారం కూడా ఇదే ధర ఉంది. ఒక 100 గ్రాముల బంగారం ధరరూ. 6,67,000గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 6,670గా ఉంది. మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 72,770గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. 100గ్రాముల బంగారం ధర రూ. 7,27,700గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,277గా ఉంది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 66,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధరరూ. 72,920గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,700 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 72,770గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి.
ఇక అటు హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,700గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,770గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఇక దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం వందగ్రాముల వెండి ధర రూ. 8,600 ఉంది. కేజీ వెండి ధర రూ. 86,000ఉంది. శనివారం కూడా ఇవే ధరలు ఉన్నాయి. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 91,000పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 86,000, బెంగళూరులో రూ. 86,000గా ఉంది.