Gold and Silver prices today: మరింత తగ్గిన బంగారం -వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా
Gold and Silver prices today: నేడు బంగారం ధర దాదాపు స్థిరంగా ఉంది. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధరలు స్వల్పంగా మార్పు చెందాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,330 రూపాయలు పలుకుతుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,940 రూపాయలు పలుకుతోంది. నిన్నటి దరతో పోల్చి చూసినట్లయితే బంగారం ధర కేవలం 50 రూపాయలు మాత్రమే తగ్గుదల నమోదు చేసింది.

అయితే మరోవైపు మాత్రం భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా అమెరికాలో నెలకొన్నటువంటి ఆర్థిక మాంద్యం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
వచ్చే నెలలో ఫెడరల్ రిజర్వ్ భేటీ అవుతున్న నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లు మన శాతం మేర తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇప్పటి నుంచే బంగారం అంచనాలను అంతర్జాతీయంగా పెంచేశారు. దీంతో అమెరికాలో సైతం బంగారం ధర ఒక ఔన్సు 2550 డాలర్లు పైగా పలుకుతోంది. ఫలితంగా బంగారం ధరలు దీనికి తోడు ప్రధానంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తీసుకున్న నిర్ణయం కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఎడాపెడా బంగారం కొనుగోలు చేస్తోంది. ఈ ప్రభావం కూడా అంతర్జాతీయ మార్కెట్ల పై పడుతోంది. చైనా గడచిన 18 నెలలకు పైగా బంగారాన్ని టన్నుల కొద్ది కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధరలు దేశీయంగా 80 వేల రూపాయలకు పైగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు గత నెల దేశీయంగా భారీగా తగ్గుముఖం పడ్డాయి. ఎందుకు ప్రధాన కారణము దేశీయంగా పసిడిపై దిగుమతి సుంకం కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గి ముఖం పట్టాయి.
కానీ ప్రస్తుతం మాత్రం మళ్లీ బంగారం ధరలు రికవరీ బాటలో ఉన్నాయి దీంతో అతి సమీపంలోనే బంగారం మరోసారి రికార్డు స్థాయికి పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం బంగారం 75 వేల రూపాయల వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది.