రైలులో జనరల్‌ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి.. కారణం ఏంటో తెలుసా..?

Indian Railways: మీరు రైళ్లలో చాలాసార్లు ప్రయాణించి ఉంటారు.

Update: 2023-02-03 13:30 GMT

రైలులో జనరల్‌ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి.. కారణం ఏంటో తెలుసా..?

Indian Railways: మీరు రైళ్లలో చాలాసార్లు ప్రయాణించి ఉంటారు. ప్రజలు సాధారణంగా తక్కువ దూరం ప్రయాణించడానికి జనరల్ కోచ్‌లో వెళ్లడానికి ఇష్టపడుతారు. ఈ కోచ్‌లో ప్రయాణించడానికి ముందస్తు బుకింగ్ అవసరం లేదు. కొన్ని కారణాల వల్ల ముందస్తుగా సీట్లు బుక్ చేసుకోలేని వారు జనరల్‌ బోగీలలో ప్రయాణిస్తారు. ఇవి సాధారణంగా రైలు ప్రారంభంలో లేదా చివరిలో ఉంటాయి. అయితే ఇవి ఇక్కడే ఎందుకు ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం.

రైల్వే అధికారుల ప్రకారం.. మిగతా కోచ్‌లలో కంటే జనరల్‌ బోగీలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోచ్‌లను రైలు మధ్యలో పెడితే మొత్తం వ్యవస్థనే కుప్పకూలుతుంది. మిగిలిన కోచ్‌లలోని ప్రయాణికులు హాయిగా దిగలేరు లేదా రైలు ఎక్కలేరు. అంతేకాదు జనరల్‌ బోగీలలో స్థలం లభించకపోతే ఆ ప్రయాణికులు ఇతర కోచ్‌లలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అందుకే జనరల్ కోచ్‌లను సాధారణంగా రైలు ప్రారంభంలో లేదా చివరిలో ఉంచుతారు.

రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్‌ని ఉంచడానికి మరొక కారణం ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు అది రెస్క్యూ-రిలీఫ్ ఆపరేషన్‌లలో సహాయపడుతుంది. రైలు మధ్యలో జనరల్ కోచ్‌ను ఉంచినట్లయితే రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తారు.

వాస్తవానికి ఒక వ్యక్తి ట్వీట్ ద్వారా రైల్వేకు ఈ విషయమై ప్రశ్నించాడు. 24 కోచ్‌లున్న ఈ రైలులో కేవలం 2 కోచ్‌లు మాత్రమే జనరల్‌ బోగీలు ఉన్నాయని, అవికూడా రైలు ముందు వెనుక భాగంలో అమర్చారని ప్రశ్నించాడు. ప్రమాదం జరిగితే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో కూర్చున్న పేదలకు మాత్రమే ముందుగా నష్టం వాటిల్లుతుందని ఆరోపించాడు. దీనిపై రైల్వే అధికారి స్పందించి జనరల్‌ బోగీలని ముందు వెనుక ఎందుకు అమర్చారో వివరించే ప్రయత్నం చేశాడు.

Tags:    

Similar News