ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకి 15 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

PM Kisan FPO: రైతుల కోసం కేంద్రప్రభుత్వం పలు పథకాలని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కొంతమంది రైతులు కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయలు అందజేస్తోంది.

Update: 2022-05-26 09:30 GMT

ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకి 15 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

PM Kisan FPO: రైతుల కోసం కేంద్రప్రభుత్వం పలు పథకాలని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కొంతమంది రైతులు కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయలు అందజేస్తోంది. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం. రైతుల ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం 'పీఎం కిసాన్ ఎఫ్‌పీఓ యోజన' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు రూ.15 లక్షలు అందజేస్తారు. కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి 11 మంది రైతులు ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు, మందులు కొనుగోలు చేయడం సులభతరం అవుతుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి..?

1. ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. అక్కడ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

3. అందులో FPO ఎంపికపై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు 'రిజిస్ట్రేషన్' ఎంపికపై క్లిక్ చేయండి.

5. రిజిస్ట్రేషన్ ఫారమ్ మీ ముందు ఓపెన్‌ అవుతుంది.

6. ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని నింపండి.

7. తర్వాత స్కాన్ చేసిన పాస్‌బుక్‌ను అప్‌లోడ్ చేయండి.

8. తర్వాత సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఇలా లాగిన్ చేయండి..

1. మీరు లాగిన్ చేయాలనుకుంటే ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. ఇప్పుడు మీ ముందు హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

3. తర్వాత మీరు FPO ఎంపికపై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు మీరు లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి.

5. తర్వాత లాగిన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది.

6. ఇప్పుడు అందులో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయండి.

7. దీనితో మీరు లాగిన్ అవుతారు. 

Tags:    

Similar News