Govt Pension Scheme: ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌.. ఇందులో చేరడానికి వీరు మాత్రమే అర్హులు..!

Govt Pension Scheme: ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పెన్షన్‌ అందించడానికి ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది.

Update: 2023-07-19 12:18 GMT

Govt Pension Scheme: ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌.. ఇందులో చేరడానికి వీరు మాత్రమే అర్హులు..!

Govt Pension Scheme: ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పెన్షన్‌ అందించడానికి ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పించడం దీని ఉద్దేశ్యమని చెప్పవచ్చు. ఈ పథకంలో దేశవ్యాప్తంగా 42 కోట్ల మంది అసంఘటిత కార్మికులు చేరారు. ఇందులో ఏ వ్యక్తి అయినా పెట్టుబడి పెట్టవచ్చు. లబ్ధిదారుడు 60 ఏళ్ల వయస్సు తర్వాత అంటే మెచ్యూరిటీ వ్యవధి తర్వాత ప్రతి నెలా రూ. 3,000 పెన్షన్‌ పొందుతాడు.

ఒకవేళ లబ్ధిదారుడు అకాల మరణం చెందితే అతని భార్య లేదా భర్త కుటుంబ పెన్షన్‌గా 50 శాతం పెన్షన్ పొందుతారు. ఈ పథకంలో చేరినవారు 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా స్థిర పెన్షన్ పొందుతారు. అయితే అసంఘటిత కార్మికులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు.

దరఖాస్తుదారు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలవారీ ఆదాయం రూ.15,000 కంటే తక్కువ ఉండాలి. వ్యవస్థీకృత రంగంలో అంటే (EPFO/NPS/ESIC సభ్యుడు) చేరనివారు అయి ఉండాలి. ఆదాయపు పన్ను పరిధిలోకి రాకూడదు.

ఈ పథకంలో చేరడానికి దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. ఆధార్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, జన్ ధన్ ఖాతా, బ్యాంక్ పాస్‌బుక్ లేదా చెక్, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఫోటోకాపీని మీతో తీసుకెళ్లాలి. ఈ పథకంలో చేరడానికి ఇంట్లో పనిచేసేవారు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చాకలివారు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కార్మికులు, వ్యవసాయం కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ, చేనేత, తోలు కార్మికులు ఇంకా ఇతర కార్మిక వృత్తుల వారు అర్హులవుతారు.

Tags:    

Similar News