PAN Card: పాన్‌కార్డు ఎవరైనా దొంగిలించారా.. త్వరగా ఈ పని చేయండి..?

PAN Card: పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను (ఐటి) శాఖ జారీ చేసే ముఖ్యమైన పత్రాలలో ఒకటి.

Update: 2022-10-27 09:44 GMT

PAN Card: పాన్‌కార్డు ఎవరైనా దొంగిలించారా.. త్వరగా ఈ పని చేయండి..?

PAN Card: పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను (ఐటి) శాఖ జారీ చేసే ముఖ్యమైన పత్రాలలో ఒకటి. ఇది పన్ను సంబంధిత సమాచారాన్ని స్టోర్‌ చేసే 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ని కలిగి ఉంటుంది. దీనిని కోల్పోతే చాలా నష్టం జరుగుతుంది. అయితే పాన్ కార్డ్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా తిరిగి పొందవచ్చు. ఈ-పాన్ కార్డ్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఐటీ శాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఈ పాన్‌కార్డుని ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించవచ్చు. దీనిని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి. NSDL అధికారిక e-Pan కార్డ్ డౌన్‌లోడ్ పేజీని సందర్శించండి. https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html ఇక్కడ మీరు e-PAN డౌన్‌లోడ్ చేయడానికి రెండు ఆప్షన్స్‌ చూస్తారు. ఒకటి అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని ఉపయోగించి, మరొకటి పాన్ కార్డ్‌ని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.రెండు ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

పాన్ కార్డ్ నంబర్ ద్వారా ఈ-పాన్‌ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం..?

1.10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ పాన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.

2. ఇప్పుడు ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ వంటి వివరాలను నమోదు చేయండి.

3. సూచనలను చదివిన తర్వాత బాక్స్‌ను టిక్ చేయండి.

4. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

5. మీ ఈ పాన్‌కార్డు PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.

6. డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ PDFపై క్లిక్ చేయండి.

మరొక విధానంలో..

1. రసీదు సంఖ్యను నమోదు చేయండి.

2. క్యాప్చా కోడ్ తర్వాత పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి.

3. సమర్పించు ఎంపికపై క్లిక్ చేయండి.

4. మీ e-PAN కార్డ్ PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.

5. e-PAN డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ PDF పై క్లిక్ చేయండి.

Tags:    

Similar News