క్రెడిట్ కార్డుదారులకి అలర్ట్.. ఆర్బీఐ,ఎన్పీసీఐ కొత్త సర్క్యులర్లు జారీ..!
Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించడానికి భారీ ఛార్జీలని చెల్లించాల్సి ఉంటుంది.
Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించడానికి భారీ ఛార్జీలని చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మార్కెట్ లేదా స్థానిక దుకాణాలలో క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తే చాలా ఛార్జీలు చెల్లించాలి. ఎందుకంటే బ్యాంకు నిబంధనలు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఈ సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే ఇటీవల NPCI, RBI రూపే క్రెడిట్ కార్డులపై కొత్త సర్క్యులర్లు జారీ చేశాయి.
NPCI ఏం చెప్పింది?
అంతర్జాతీయ లావాదేవీల కోసం చేసే చెల్లింపుల నిబంధనలే రూపే క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తిస్తాయని నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే కొంత పరిమితి విధించింది. 2,000 రూపాయల వరకు లావాదేవీలకి జీరో మర్చంట్ రాయితీ రేటు (MDR) ఉంటుందని పేర్కొంది. ఈ మధ్య కాలంలో UPI లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.
RBI సర్క్యులర్
మీడియా నివేదికల ప్రకారం ఎన్‌పిసిఐ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని అన్ని బ్యాంకులు ఈ నిబంధనలని అమలు చేయాలని బ్యాంకులని ఆదేశించింది. క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్ చెల్లింపుపై దాదాపు అన్ని బ్యాంకులు సర్‌చార్జిని విధిస్తాయి. కొన్ని బ్యాంకులు ఈ ఛార్జీని రీఫండ్ చేస్తాయి కొన్ని చేయవు. కానీ వాపసుకు కూడా నిర్ణీత పరిమితి ఉంటుంది. మీరు ఆ పరిమితి కంటే ఎక్కువ ఆయిల్ నింపినట్లయితే ఈ ఛార్జీ వాపసు చేయబడదు. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంక్ మై లోన్ కార్డ్‌పై పెట్రోల్, డీజిల్ నింపడానికి నెలవారీ పరిమితి రూ.4,000గా ఉంటుంది.
నగదు విత్ డ్రా ఛార్జీలు
ప్రతి క్రెడిట్ కార్డుకు నగదు పరిమితి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా నగదును విత్‌డ్రా చేసిన వెంటనే బ్యాంకు భారీ ఛార్జీలను విధిస్తుంది. కార్డుతో షాపింగ్ చేసేటప్పుడు గడువు తేదీ వరకు ఎటువంటి ఛార్జీలు విధించదు. కానీ నగదు విత్‌డ్రా చేసుకునేటప్పుడు అలా ఉండదు. వీలైతే క్రెడిట్ కార్డ్ నుంచి నగదు విత్ డ్రా నివారించడం మంచిది.