Credit Card: క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై జాగ్రత్త.. లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది..!

Credit Card: గత కొన్ని సంవత్సరాలుగా క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Update: 2022-12-21 06:30 GMT

Credit Card: క్రెడిట్‌ కార్డు చెల్లింపులపై జాగ్రత్త.. లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది..!

Credit Card: గత కొన్ని సంవత్సరాలుగా క్రెడిట్ కార్డ్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మీరు క్రెడిట్ కార్డ్‌ని వాడుతుంటే దాని భద్రత గురించి కూడా తెలుసుకోవాలి. కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. అప్పుడే మోసం ప్రమాదం తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ మోసాన్ని నివారించడానికి కొన్ని చిట్కాలని తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ వివరాలను చెప్పకూడదు

క్రెడిట్ కార్డ్ పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులైనా చెప్పకూడదు. క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని షేర్ చేయమని మెస్సేజ్‌ లేదా ఈ మెయిల్ వచ్చినప్పుడు స్పందించకూడదు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇలాంటి వివరాలను ఎప్పుడూ అడగవని గుర్తుంచుకోండి. ఇది కాకుండా పబ్లిక్ వైఫైని ఉపయోగించి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు చేయకుండా ఉండటం మేలు.

కార్డుపై పరిమితి

క్రెడిట్ కార్డ్ ఖర్చుపై లిమిట్‌ సెట్ చేయవచ్చు. ఏటీఎం వినియోగం, మర్చంట్‌ అవుట్‌లెట్ స్వైప్‌లు, ఆన్‌లైన్ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ వినియోగం, అంతర్జాతీయ లావాదేవీ పరిమితుల కోసం పరిమితులను సెట్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని తెలివిగా ఉపయోగించుకోండి.

రోజువారీ ఖర్చుల కోసం ప్రత్యేక కార్డు

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉంటే ఫోన్ బిల్లు, నెలవారీ సభ్యత్వం, ఈఎంఐ, మొదలైన ఆటోమేటిక్ చెల్లింపు కోసం ఈ కార్డ్‌లలో ఒకటి మాత్రమే ఉపయోగించాలి. అలాగే రిటైల్ కార్డ్ రీడర్‌లు, రెస్టారెంట్ యజమానులు లేదా పెట్రోల్ పంప్ ఉద్యోగుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్ బిల్లును చెక్ చేసుకోండి.

Tags:    

Similar News