New Labor Laws: కొత్త కార్మిక నిబంధనలు.. అర్హులైన కార్మికులకి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్..!
New Labor Laws: కొత్త కార్మిక చట్టాలకి పార్లమెంట్‌లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.
New Labor Laws: కొత్త కార్మిక చట్టాలకి పార్లమెంట్‌లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. వీటికోసం కార్మికలోకం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ చట్టాల అమలు తర్వాత యజమాని, ఉద్యోగి నియమాలు రెండు మారుతాయి. టేక్ హోమ్ జీతం, ఈపీఎఫ్ సహకారం, సంవత్సరంలో అందుబాటులో ఉన్న సెలవుల సంఖ్య, వారంలో గరిష్ట పని గంటలు మొదలైన విషయాలలో మార్పులు జరుగుతాయి. ఈ నాలుగు లేబర్ కోడ్‌లలో ఒకటి ఉద్యోగుల సెలవులకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొత్త కోడ్ ప్రకారం ఏ ఉద్యోగి సంవత్సరంలో 30 కంటే ఎక్కువ చెల్లింపు సెలవులను (leave encashment) సేకరించకూడదు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020లోని సెక్షన్ 32లో వార్షిక సెలవులు, క్యారీ ఫార్వర్డ్, ఎన్‌క్యాష్‌మెంట్ గురించి నియమాలు ఉన్నాయి. వీటి ప్రకారం ఒక ఉద్యోగి సంవత్సరంలో గరిష్టంగా 30 రోజుల వరకు వార్షిక సెలవును ఫార్వార్డ్ చేయడానికి అనుమతి ఉంది. ఒకవేళ రూ.30 దాటితే ఆ లీవులని ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. మిగిలిన 30 సెలవులను వచ్చే ఏడాదికి కొనసాగించవచ్చు.
కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత యూజ్డ్ లీవ్ ల్యాప్స్ విధానం పూర్తిగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు వార్షిక ప్రాతిపదికన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను అనుమతించడం లేదు. దీనివల్ల యజమానిపై ఆర్థిక భారం పడుతుందని కొందరి వాదన. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, వేజ్ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్ ఈ నాలుగు చట్టాలు ఏ తేదీ నుంచి అమలులోకి వస్తాయో సరైన సమాచారం తెలియదు. వీటిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.