Alert Farmers: రైతులకు అలర్ట్‌.. ఈ కార్డు కింద పెట్టుబడి సాయం అందుతుంది..!

Alert Farmers: రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీంలను అమలుచేస్తున్నాయి. ఇందులో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి).

Update: 2023-12-02 03:35 GMT

Alert Farmers: రైతులకు అలర్ట్‌.. ఈ కార్డు కింద పెట్టుబడి సాయం అందుతుంది..!

Alert Farmers: రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీంలను అమలుచేస్తున్నాయి. ఇందులో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి). ఈ కార్డు కింద తక్కువ వడ్డీకే రుణాలను మంజూరుచేస్తున్నాయి. ఇప్పటి వరకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం అప్లై చేయని రైతులు వెంటనే అప్లై చేసుకుంటే ఉత్తమం. KCC అనేది కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం. దీని కింద రైతులు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఇందుకోసం 4 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రైతులు సకాలంలో రుణం చెల్లిస్తే 3 శాతం సబ్సిడీ లభిస్తుంది.

ఒక రైతు కెసిసి కింద రూ. 1.60 లక్షల వరకు రుణాన్ని సులభంగా పొందవచ్చు. దీని కోసం రైతు ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. రైతు సోదరులు పశుపోషణ, చేపల పెంపకం, వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే వారు KCC నుంచి రుణం తీసుకోవచ్చు. ఇది ఒక స్వల్పకాలిక రుణం. రైతు సోదరుడి పత్రాలన్నీ సరైనవని తేలితే కేవలం 14 రోజుల్లో బ్యాంకు కార్డును జారీ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం KCC కార్డు కింద రుణాలు తీసుకునే రైతులకు ఇప్పుడు పశుపోషణ, చేపల పెంపకంపై వడ్డీపై సబ్సిడీ లభిస్తుంది. కానీ రూ.3 లక్షలకు బదులు రూ.2 లక్షలు మాత్రమే రుణం మంజూరుచేస్తున్నారు. 14 రోజుల్లోపు కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని పొందాలంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇందుకోసం భూమి పత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారు అఫిడవిట్, అలాగే ఒక ఫారమ్ నింపాల్సి ఉంటుంది.

Tags:    

Similar News