PAN Card: అలర్ట్‌.. పాన్‌కార్డు లేదంటే ఈ పనులు జరగవు..!

PAN Card: ఇండియాలో పాన్‌కార్డు చాలా ముఖ్యమైన కార్డు. ఆర్ధిక లావాదేవీల విషయంలో దీని అవసరం కచ్చితంగా ఉంటుంది.

Update: 2022-12-14 04:30 GMT

PAN Card: అలర్ట్‌.. పాన్‌కార్డు లేదంటే ఈ పనులు జరగవు..!

PAN Card: ఇండియాలో పాన్‌కార్డు చాలా ముఖ్యమైన కార్డు. ఆర్ధిక లావాదేవీల విషయంలో దీని అవసరం కచ్చితంగా ఉంటుంది. దీనిని ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంది. పాన్‌కార్డు లేదంటే చాలా పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఒక్క ఆర్థిక లావాదేవీలే కాదు దీంతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు మాదిరి పాన్‌కార్డుని కూడా గుర్తింపు రుజువుగా ఉపయోగించవచ్చు. రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం సంబంధిత అధికారులకు పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టాలన్నా, మ్యూచ్‌వల్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్నా పాన్‌కార్డు అవసరమవుతుంది. పాన్‌కార్డుని తప్పకుండా బ్యాంకు అకౌంట్‌తో లింక్‌ చేసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో 50 వేల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనుకుంటే పాన్ కార్డ్ అవసరమవుతుంది.

లోన్ దరఖాస్తు సమయంలో పాన్ కార్డ్‌తో సహా అవసరమైన అన్ని పత్రాలని అందించాలి. ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ లేదా మరేదైనా రుణం కోసం పాన్ కార్డ్ అవసరమవుతుంది. పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి సంస్థలు తప్పనిసరిగా పాన్ కార్డ్‌ని కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్‌ చేయడానికి కూడా పాన్‌ కావాలి. ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు, అద్దెకు ఇచ్చేటప్పుడు లేదా అమ్మేటపపుడు పాన్ కార్డ్ అవసరమవుతుంది.

Tags:    

Similar News