మరోమారు భారీ నష్టాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు
* సెన్సెక్స్ 379 పాయింట్లు దిగజారి 51,324 వద్ద క్లోజ్ * నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 15,118 వద్ద స్థిరం
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు భారీ నష్టాలను మూటగట్టాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ దేశీ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమై లాభాల బాటన సాగాయి అయితే మిడ్ సెషన్ సమయానికి సూచీలు యూ-టర్న్ తీసుకోవడంతో సెన్సెక్స్ 400పాయింట్ల మేర కోల్పోగా నిఫ్టీ 15,110 పాయింట్ల వద్ద ట్రేడవుతూ వచ్చింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు దిగజారి 51,324 వద్దకు చేరగా నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 15,118 వద్ద స్థిరపడ్డాయి అధిక స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం. నష్టాలకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.