Water Sprinkler: 900 రూపాయలలో ఏసీ లాంటి చల్లని గాలి.. ఈ ఒక్క సెటప్ ఉంటే చాలు..!
Water Sprinkler: వేసవి వచ్చిందంటే ఏసీలకి, కూలర్లకి డిమాండ్ పెరుగుతుంది.
Water Sprinkler: వేసవి వచ్చిందంటే ఏసీలకి, కూలర్లకి డిమాండ్ పెరుగుతుంది. అయితే పేద ప్రజలకి వీటి కొనుగోలు కొంచెం కష్టంగానే ఉంటుంది. కారణం వాటి ధరలు అధికంగా ఉండటమే. అయితే కొంతమంది చల్లగాలి కోసం వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌లపై ఆధారపడుతారు. ఈ రోజుల్లో వీటికి కూడా డిమాండ్ పెరిగింది. దీనికి కారణం వాటి కూలింగ్ సామర్థ్యం పెరగడమే. నిజానికి ఇంట్లో ఎయిర్ కండీషనర్ లేదంటే మంచి కూలింగ్ కోసం ఈ ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ బడ్జెట్‌లో ఈ ఫ్యాన్ రానప్పుడు ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం.
స్ప్రింక్లర్ ఫ్యాన్ అధిక ధర ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉండే సాధారణ స్టాండ్ ఫ్యాన్‌నే వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌గా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. ఇలా మార్చడానికి మార్కెట్లో ప్రత్యేక సెటప్ ఉంటుంది. ఇందులో భాగంగా స్ప్రింక్లర్ పైపులు, పంప్‌ల సెటప్‌ని సాధారణ స్టాండ్ ఫ్యాన్‌కి జోడించాల్సి ఉంటుంది. తర్వాత దాని పంప్ సెక్షన్‌ను ఒక బకెట్‌లో వేసి అందులో నీటిని నింపాలి. ఫ్యాన్‌ను ఆన్ చేసిన వెంటనే దాని పంపు నీటిని పీల్చుకొని ఒత్తిడితో ముందు వైపుకు చల్లుతుంది. దాని పైనుంచి గాలి వీచినప్పుడు చల్లటి గాలి మనికి తాకుతుంది. ఇలా చేయడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
ధర ఎంత?
వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్ ధర గురించి మాట్లాడినట్లయితే వినియోగదారులు అమెజాన్ నుంచి కేవలం రూ.899కి కొనుగోలు చేయవచ్చు. దీనిని ఇంట్లో స్టాండ్ ఫ్యాన్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ సెటప్ వాడటానికి చాలా సులభం. అంతేకాకుండా తక్కువ ధరలో పని ముగుస్తుంది. ప్రత్యేకించి ఆరుబయట కూర్చున్నప్పుడు లేదా ఇంట్లో ఎయిర్ కండీషనర్ లేనప్పుడు. ఇలాంటి సెటప్ చేసుకుంటే బాగుంటుంది.