తెలంగాణ ఉద్యమంలో కూడా టీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం

హుజూర్‌నగర్‌లో తమ పార్టీ మద్దతు కోసం ప్రతీ ఒక్కరు అడుగుతున్నారని, అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా తమ మద్దత కోరిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేశామని స్పష్టం చేశారు.

Update: 2019-09-30 09:26 GMT

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో సీపీఐ పోటీ చేయకపోవడంపై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో తమ పార్టీ మద్దతు కోసం ప్రతీ ఒక్కరు అడుగుతున్నారని, అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా తమ మద్దతు కోరిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌తో కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. ఎన్నికలంటేనే డబ్బుతో ముడిపడిన అంశం అందుకే ఉపఎన్నికలో పోటీ చేయడం లేదన్నారు. బీజేపీని నిలువరించేది కమ్యూనిస్టు పార్టీలేనని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News