స్మోకింగ్ మరియు డ్రింకింగ్ మానేయాలనుకుంటున్నారా..!

స్మోకింగ్ మరియు డ్రింకింగ్ మానేయాలనుకుంటున్నారా..! స్మోకింగ్ మరియు డ్రింకింగ్ మానేయాలనుకుంటున్నారా..!

Update: 2019-10-09 13:11 GMT

స్మోకింగ్ మరియు డ్రింకింగ్ ఒకసారి అలవాటు అయితే వాటిని అంత త్వరగా మానటం కష్టం అని చెబుతుంటారు మందుబాబులు. వాటికి ఎంత దూరంగా ఉండాలనుకుంటే అవి అంత దగ్గరకి వస్తుంటాయని చాలమంది అభిప్రాయపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు సైంటిస్టులు.

స్మోకింగ్ మరియు డ్రింకింగ్ వంటి వ్యసనాలకు స్వస్తి చెప్పాలంటే ప్రకృతికి దగ్గరవ్వాలి అంటున్నారు సైంటిస్టులు. నిత్యం పచ్చని ప్రకృతి వాతావరణంలో కొంత సేపు గడిపితే ఆ చెడు అలవాట్ల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చని సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనాల్లో వెల్లడైంది. నిత్యం డ్రింక్ సేవించేవారు, స్మోకింగ్ అధికంగా తాగేవారు.. ఆయా అలవాట్ల నుంచి బయటపడాలంటే.. నిత్యం పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంత సేపు గడిపుతుంటే.. మెల్లమెల్లగా చెడు అలవాట్ల నుంచి విముక్తి పొందవచ్చు అంటున్నారు సైంటిస్టులు.  

Tags:    

Similar News