వేధింపులకు అర్థాలు మారిపోతున్నాయి. గృహ హింసకు స్పెల్లింగ్ మారిపోతోంది. విడాకులు కోరడానికి కారణాలు రోజు రోజుకూ సిల్లీగా మారిపోతున్నాయి. చాలా వరకూ విడాకులకు వెళ్లేవారు చూపించే కారణాల్లో హేతుకత ఉండదని లాయర్లు చెబుతుంటారు. పోనీ, అదేదో అనుకుంటే.. ఇపుడు అసలు ఆ కారణమే నవ్వు తెప్పించేదిగా ఉండటం విశేషం.
ఇది వింటే మీరూ పగలబడి నవ్వుతారు. ఓ అరబ్ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరిన కారణం ఎంటో తెలిస్తే మాత్రం నవ్వకుండా ఉండలేరు. భర్త తనను పబ్జీ గేమ్ ఆడనివ్వడం లేదంటూ సదరు మహిళ విడాకులు కోరింది. అంతేగాక తన ఇష్టాన్ని భర్త విలువ ఇవ్వడం లేదని, అతడి ఇష్టం ప్రకారమే నడుచుకోవాలని చెబుతున్నట్లు సదరు మహిళ పేర్కొంది. ఈ మేరకు అజ్మన్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో భర్తను విచారించారు. అయితే, తాను అలా ఏమీ చెప్పలేదని ఎప్పుడు గేమ్‌లో మునిగిపోకుండా కొంత సమయం కటుంబ సభ్యులతో కూడా గడపాలని చెప్పినట్లు తెలిపాడు. ఆమెను కంట్రోల్ చేయడానికి ప్రత్నించలేదన్నాడు. కుటుంబ గౌరవాన్ని కాపాడాలని మాత్రమే చెప్పానని, చిన్న పిల్లల గేమ్ ఆడుతూ ఉండడం అతిథుల ముందు బాగోదని సముదాయించినట్టు పేర్కొన్నాడు. అయితే, ఇంత చిన్న కారణానికి తన భార్య విడాకుల వరకు వెళ్తుందని మాత్రం అనుకోలేదని వాపోయాడు.