Mercedes-Benz EQS 450: జనవరి 9న లాంచ్ కానున్న కొత్త మెర్సిడెస్.. ఫీచర్లు గురించి తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.. !

Mercedes-Benz EQS 450 Launch Date: మరికొద్ద రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. చాలా వాహన తయారీ కంపెనీలు కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త వాహనాలను తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

Update: 2024-12-17 10:07 GMT

Mercedes-Benz EQS 450: జనవరి 9న లాంచ్ కానున్న కొత్త మెర్సిడెస్.. ఫీచర్లు గురించి తెలిస్తే పిచ్చెక్కాల్సిందే.. ! 

Mercedes-Benz EQS 450 Launch Date: మరికొద్ద రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. చాలా వాహన తయారీ కంపెనీలు కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త వాహనాలను తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అదే సమయంలో, లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ కూడా భారతదేశంలో కొత్త కారును విడుదల చేయడానికి సిద్ధమైంది. మెర్సిడెస్ బెంజ్ ఈ కొత్త కారు జనవరి 9, 2025న రిలీజ్ కానుంది. ఇది 5-సీటర్ కారు. అదే రోజున మెర్సిడెస్ G 580 కూడా మార్కెట్లోకి విడుదల కానుంది. అమెరికా తర్వాత ఈక్యూఎస్ ఎస్‌యూవీని విడుదల చేసిన తొలి మార్కెట్ భారత్.

మెర్సిడెస్ EQS పవర్

మెర్సిడెస్ EQS 450 అనేది మేబ్యాక్ లైనప్‌లో రెండవ వేరియంట్. ఈ కారు 5-సీటర్ మోడల్‌లో రాబోతోంది. ఈ వాహనం 122కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో రాబోతోంది, దీనిని మెర్సిడెస్ 7-సీటర్ EQS 580 4-మ్యాటిక్ ఎస్ యూవీలో ఉపయోగించారు. ఈ మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారును కేవలం 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి, 200 KW DC ఛార్జర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. మెర్సిడెస్ EQA మోడల్ 70.5 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. EQE 90.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో రాబోతుంది.

కొత్త మెర్సిడెస్ ఫీచర్లు

ఈ మెర్సిడెస్ కారు బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్‌ను కలిగి ఉంది, ఇది ముందు బంపర్ వరకు పొడిగించబడింది. ఈ వాహనంలో 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ లగ్జరీ కారు లోపలి భాగంలో ఎయిర్ కంట్రోల్ ప్లస్ ఫీచర్ అందించబడింది. వాహనం 56-అంగుళాల హైపర్‌స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇందులో 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్, 17.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. వెనుక ప్రయాణీకుల వినోదం కోసం వాహనం 11.6-అంగుళాల స్క్రీన్‌తో కూడా అమర్చబడింది.

ఈ మెర్సిడెస్ కారులో 5-స్పీకర్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, 5-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు కూడా ఉన్నాయి. వాహనంలోని వ్యక్తుల భద్రతపై కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారులో లెవెల్-2 ADAS, 9 ఎయిర్‌బ్యాగ్‌లను అందించవచ్చు.

మెర్సిడెస్ EQS ధర ఎంత ఉంటుంది?

వాహనంలో పెద్ద క్యాబిన్ స్పేస్ ఇష్టపడే వారికి కూడా ఈ మెర్సిడెస్ కారు బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పొచ్చు. Mercedes EQE ధర ధర రూ. 1.59 కోట్లు, EQS SUV ధర రూ. 1.61 కోట్లు. ఈ మెర్సిడెస్ కారు ధర ఈ రెండు వాహనాల ధర పరిధిలో రావచ్చు.

Tags:    

Similar News