Maruti Dzire: కొత్త కారు కొనడం మీ కలా.? నెలకు రూ. 15 వేలు చెల్లిస్తే చాలు..!

Maruti Dzire: కొత్త కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అందుకోసం ఎన్నో కలలు కంటారు. అలాంటి వారి కోసమే కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లను ఆందిస్తున్నారు.

Update: 2024-12-11 06:25 GMT

Maruti Dzire: కొత్త కారు కొనడం మీ కలా.? నెలకు రూ. 15 వేలు చెల్లిస్తే చాలు..!

Maruti Dzire: కొత్త కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అందుకోసం ఎన్నో కలలు కంటారు. అలాంటి వారి కోసమే కార్ల కంపెనీలు రకరకాల ఆఫర్లను ఆందిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ సంస్థలు సులభతరమైన చెల్లింపుల్లో కార్లను సొంతం చేసుకునేందుకు గాను ఈఎమ్‌ఐ ఆప్షన్స్‌ను అందిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్‌ కారు గురించి ఈరోజు తెలుసుకుందాం.

మారుతి కంపెనీకి చెందిన డిజైర్‌ కారుకు మార్కెట్లో ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచి మైలేజ్‌తో పాటు ఫీచర్లు ఉన్న ఈ కారుకు భారత్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ కార్ల అమ్మకాలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ కారును నెలకు కేవలం రూ. 15 వేలు చెల్లిస్తూ సొంతం చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సెడాన్ బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షలుగా ఉంది. అయితే ఆన్‌రోడ్‌ విషయానికొస్తే.. రూ. 7.6 లక్షలుగా ఉంది. ఈ కారును కొనుగోలు చేయాలంటే మీరు రూ. 50,000 డౌన్‌పేమెంట్‌ చేస్తే సరిపోతుంది. కొత్త కారుపై మీకు రూ. 6.29 లక్షల లోన్‌ లభిస్తుంది. ఆ తర్వాత మీర 5 ఏళ్లపాటు నెలకు రూ. 15,893 ఈఎమ్‌ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లలో కారు మీ సొంతమవుతుందన్నమాట.

ఇంతకీ ఈ కొత్త మారుతి డిజైర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో 9 ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో తీసుకొచ్చారు. అలాగే ఆటోమేటిక్ ఏసీ విత్ రియర్ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఇందులో అందించారు.

ఇక ఈ కారులో 1.2-లీటర్ 3-సిలిండర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఇచచారు. ఇది 82 PS పవర్, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. మైలేజ్‌ విషయానికొస్తే పెట్రోల్‌ మాన్యువల్‌ లీటర్‌కు 24.79 పెట్రోల్‌ ఏఎమ్‌టీ వెర్షన్‌ 24.79, సీఎన్‌జీ కిలోకు 33.73 ఇస్తుంది. 

Tags:    

Similar News