Renault Triber: పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ కారు.. రూ.66000వేలు చౌక.. ఇంత కన్నా బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు..!
Renault Triber : డిసెంబర్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. లక్షల రూపాయలు వెచ్చించి ఏ మోడల్‌ని కొనుగోలు చేయాలనే అయోమయంలో ఉన్నారా.
Renault Triber : డిసెంబర్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. లక్షల రూపాయలు వెచ్చించి ఏ మోడల్‌ని కొనుగోలు చేయాలనే అయోమయంలో ఉన్నారా. అంతేకాకుండా మీది కాస్త పెద్ద ఫ్యామిలీనా.. అయితే ఈ కథనంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు గురించి తెలుసుకుందాం. రెనాల్ట్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ట్రైబర్ మాత్రమే 7-సీటర్ కారు. ఇది దేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్ ఎంపీవీగా కూడా. భారతీయ మార్కెట్లో ఇది మారుతి ఎర్టిగాతో పోటీపడుతుంది. ఇది 7-సీటర్ అయినప్పటికీ, మారుతి స్విఫ్ట్, బాలెనో వంటి కార్ల కంటే చాలా చౌకగా ఉంటుంది.
మారుతీ స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.6.49 లక్షల నుండి రూ.9.64 లక్షల వరకు ఉన్నాయి. మారుతి సుజుకి బాలెనో ఎక్స్-షోరూమ్ ధరలు రూ.6.66 లక్షల నుండి రూ.9.83 లక్షల వరకు ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6 లక్షల నుండి రూ. 8.98 లక్షల మధ్య ఉంటుంది. అంటే స్విఫ్ట్ కంటే దాదాపు రూ.50 వేలు, బాలెనో కంటే రూ.66 వేలు తక్కువ. ఈ నెలలో ట్రైబర్‌పై కంపెనీ రూ.60,000 వరకు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ట్రైబర్ 1.0-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 71హెచ్ పీ పవర్, 96 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ , ఏఎంటీతో వస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 18 నుండి 19 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,636ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 182ఎంఎం. ప్రజలు ఎక్కువ స్పేస్ పొందే విధంగా దీన్ని రూపొందించారు. ట్రైబర్ సీటును 100 కంటే ఎక్కువ మార్గాల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
ఇది కొత్త స్టైలిష్ ఫాబ్రిక్ అప్హోల్స్టరీతొ వస్తుంది. పూర్తి డిజిటల్ వైట్ ఎల్ ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రోమ్ రింగులతో కూడిన HVAC నాబ్‌లు, బ్లాక్ కలర్ లోపలి డోర్ హ్యాండిల్స్ ఈ కారును స్టైలిష్‌గా మార్చాయి. ఈ కారు Apple CarPlay, Android Autoతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మౌంటెడ్ కంట్రోల్‌లతో స్టీరింగ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఎల్ ఈడీ డీఆర్ఎల్ లతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి అనేక గొప్ప ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ కారును లిమిటెడ్ ఎడిషన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీన్ని డ్యూయల్-టోన్ కలర్ మూన్‌లైట్ సిల్వర్, సెడార్ బ్రౌన్‌లో కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్‌తో కొనుగోలు చేయగలుగుతారు. ఇది కొత్త 14-అంగుళాల ఫ్లెక్స్ వీల్స్‌ను కూడా పొందుతుంది. ఇది పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. రెనాల్ట్ ట్రైబర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో పెద్దలకు 4 స్టార్ రేటింగ్ , పిల్లల కోసం 3 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇది డ్రైవర్, ప్రయాణీకుల కోసం సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. డ్రైవర్ సీటులో లోడ్ లిమిటర్, ప్రిటెన్షనర్ కూడా అందుబాటులో ఉన్నాయి.