Car Battery Drain in Winter: చలి కారణంగా బ్యాటరీలు పాడైపోయి కార్లు స్టార్ట్ కావడం లేదా.. ఈ టిప్స్ పాటించండి
Car Battery Drain in Winter: వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించే భారతదేశం వంటి దేశాల్లో కారు బ్యాటరీలు తరచుగా త్వరగా డ్రైన్ అవుతాయి.
Car Battery Drain in Winter: వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించే భారతదేశం వంటి దేశాల్లో కారు బ్యాటరీలు తరచుగా త్వరగా డ్రైన్ అవుతాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కారును స్టార్ట్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. ఈ సమస్యను నివారించడానికి, చలిలో కూడా మీ కారు బ్యాటరీని హెల్తీగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ వార్తా కథనంలో చూద్దాం.
1. సింపుల్ సర్వీసింగ్ చేయండి
శీతాకాలంలో బ్యాటరీ పనితీరును నిర్వహించడానికి, దాని గురించి సరైన జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. అన్నింటిలో మొదటిది, బ్యాటరీ టెర్మినల్స్‌ను తనిఖీ చేయండి. అక్కడ ఏదైనా తుప్పు ఉందో లేదో చూడండి. తుప్పు పట్టినట్లయితే.. బేకింగ్ సోడా, నీటితో శుభ్రం చేయండి. ఇది కారు బ్యాటరీ శక్తిని పెంచుతుంది. కారు సులభంగా స్టార్ట్ అవుతుంది.
2. బ్యాటరీ వార్మర్ ఉపయోగించండి
మీరు చల్లని ప్రాంతంలో నివసిస్తుంటే..బ్యాటరీ వార్మర్‌ను కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బ్యాటరీని వెచ్చగా ఉంచుతుంది. ఇది దాని పనితీరును మంచిగా నిర్వహిస్తుంది. బ్యాటరీ త్వరగా డ్రైన్ కాదు. ముఖ్యంగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న చోట, బ్యాటరీ వార్మర్ ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. తక్కువ దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి
మీరు తరచుగా కారును స్టార్ట్ చేసి తక్కువ దూరం ప్రయాణిస్తే.. బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. చిన్న ప్రయాణాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయ్యే సమయం దొరకకపోవడమే ఇందుకు కారణం. అందువల్ల, బ్యాటరీని సరిగ్గా ఛార్జ్ చేయడానికి సుదూర ప్రయాణాలకు వెళ్లడానికి ప్రయత్నించండి.
4. అనవసరమైన వాటిని క్లోజ్ చేయండి
కారులో లైట్లు, హీటర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు ఉన్నాయి. ఇవి బ్యాటరీ శక్తిని అనవసరంగా ఖాళీ చేయగలవు. కారును ఆపే ముందు ఈ వస్తువులన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయండి, తద్వారా బ్యాటరీపై ఒత్తిడి ఉండదు. దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది.
5. సింథటిక్ ఆయిల్ ఉపయోగించండి
సింథటిక్ ఆయిల్ చల్లని వాతావరణంలో కారు ఇంజిన్‌లకు మంచిది ఎందుకంటే ఇది సులభంగా ప్రవహిస్తుంది. చల్లని వాతావరణంలో ఇంజిన్‌ను త్వరగా ప్రారంభించడంలో సహాయపడుతుంది. ఇది బ్యాటరీపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, ఇది బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది.
6. బ్యాటరీని ఛార్జ్ చేయండి
మీ కారు ఎక్కువసేపు నడవకపోతే, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ట్రికిల్ ఛార్జర్‌ని ఉపయోగించండి. ఇది బ్యాటరీని ఓవర్‌ఛార్జ్ చేయకుండా ఛార్జ్ చేస్తుంది, తద్వారా బ్యాటరీ పూర్తిగా డ్రెయిన్ అవ్వదు.
ఈ సులభమైన చిట్కాలతో మీరు మీ కారు బ్యాటరీని చలికాలంలో కూడా బాగా పని చేయించగలరు. సరైన జాగ్రత్తతో.. కొంచెం అవగాహనతో మీరు మీ కారును చల్లని వాతావరణంలో కూడా నడుపుకోవచ్చు . దాని బ్యాటరీని ఎక్కువసేపు ఉండేలా చేయవచ్చు.