MG Astor: త్వరపడండి ఈ ఆఫర్ పోతే మళ్లీ రాదు.. ఎంజీ ఆస్టర్‌పై రూ.1.25లక్షల భారీ తగ్గింపు

MG Astor: ఆటోమొబైల్ అప్‌డేట్స్ అందించే ఆటోకార్ ఇండియా ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. ఎంజీ ఆస్టర్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి గరిష్టంగా రూ. 1.25 లక్షల వరకు ఆదా అవుతుంది.

Update: 2024-12-12 08:30 GMT

MG Astor

MG Astor features and prices explained: ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. కొత్త కార్లను కొనేవాళ్లలో మార్కెట్లో ప్రస్తుతం 51 శాతం మంది ఎస్‌యూవీలనే కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొత్త ఎస్‌యూవీని కొనాలనే ప్లాన్‌లో ఉన్న వారి కోసమే ఈ డీటేయిల్స్. ప్రముఖ కార్ల తయారీదారు MG డిసెంబర్ 2024లో ప్రముఖ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ ఆస్టర్‌పై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.

ఆటోమొబైల్ అప్‌డేట్స్ అందించే ఆటోకార్ ఇండియా ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. ఎంజీ ఆస్టర్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి గరిష్టంగా రూ. 1.25 లక్షల వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం, కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఎంజీ ఆస్టర్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి (MG Astor features and prices) ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కస్టమర్లు ఎంజీ ఆస్టర్‌లో రెండు ఇంజిన్‌ల ఆఫ్షన్‌తో (MG Astor Engine) వస్తోంది. మొదటి వేరియంట్‌లో 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అమర్చారు. ఇది గరిష్టంగా 140bhp పవర్, 220 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

మరొక వేరియంట్‌ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందింది. ఇది గరిష్టంగా 110 Bhp పవర్, 144 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. భారతీయ మార్కెట్లో ఎంజీ ఆస్టర్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో పోటీ పడుతోంది.

ఎంజీ ఆస్టర్‌ ఫీచర్స్

ఈ కారులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. ఇది కాకుండా, భద్రత కోసం, కారులో 6-ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో కూడిన అధునాతన డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎంజీ ఆస్టర్ ఎక్స్-షోరూమ్ ధర (MG Astor Ex-showroom prices) టాప్ మోడల్ రూ. 9.98 లక్షల నుండి రూ. 18.08 లక్షల వరకు ఉంటుంది.

Tags:    

Similar News