Honda: హోండా ఎలివేట్, సిటీ, అమేజ్‌పై బంపర్ ఆఫర్.. రూ.1.14లక్షల తగ్గింపు..!

Honda: ప్రముఖ కార్ల తయారీదారు హోండా తన సిటీ, సిటీ ఇ:హెచ్‌ఇవి, ఎలివేట్, అమేజ్ (సెకండ్ జెన్) మోడళ్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

Update: 2024-12-14 14:02 GMT

Honda: హోండా ఎలివేట్, సిటీ, అమేజ్‌పై బంపర్ ఆఫర్.. రూ.1.14లక్షల తగ్గింపు..!

Honda: ప్రముఖ కార్ల తయారీదారు హోండా తన సిటీ, సిటీ ఇ:హెచ్‌ఇవి, ఎలివేట్, అమేజ్ (సెకండ్ జెన్) మోడళ్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. 'హోండా డిసెంబర్ రష్' కార్యక్రమం కింద కంపెనీ రూ.1.14 లక్షల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. తన స్టాక్‌ను క్లియర్ చేయడానికి, కంపెనీ ఈ బంపర్ తగ్గింపును ఇస్తోంది. జపాన్ కార్ల తయారీ సంస్థ ఈ ఏడాది చివరి వరకు ఈ ఆఫర్‌లతో అమ్మకాలను పెంచుకోవాలనుకుంటోంది. దాని వివరాలను వివరంగా తెలుసుకుందాం. జపనీస్ కార్‌మేకర్ 7 సంవత్సరాల వారంటీని, 8 సంవత్సరాల బైబ్యాక్ ప్రైస్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అంతే కాకుండా స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.4 లక్షల వరకు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

హోండా డిసెంబర్ ఆఫర్ ప్రయోజనాలు

హోండా సిటీపై రూ. 1.14 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. రెండవ తరం హోండా అమేజ్ రూ. 1.12 లక్షల వరకు తగ్గింపును కంపెనీ అందిస్తోంది. అలాగే హోండా ఎలివేట్‌పై రూ.95,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇది కాకుండా, సిటీ e:HEVలో రూ. 90,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. తమిళనాడులో ఈ ఆఫర్‌లు వర్తించవు. కానీ, ఈ ఆఫర్‌లు జనవరి 2025లో ధర పెరిగే ముందు డిసెంబర్ చివరి వరకు చెల్లుబాటులో ఉంటాయి. సిటీ e:HEV, ఎలివేట్ అపెక్స్ వేరియంట్‌లపై పొడిగించిన వారంటీ వర్తించదని హోండా ఫైన్ ప్రింట్‌లో పేర్కొంది.

స్క్రాచ్ అండ్ విన్

స్క్రాచ్ అండ్ విన్ కార్డ్‌లో 3 డే/2 నైట్ హాలిడే వోచర్, రూ. 4 లక్షలు, రూ. 1 లక్ష చెక్ ఉంటాయి. ఇది చాలా మంది విజేతలకు ఈ ప్రైజ్ మనీ ఇవ్వనుంది కంపెనీ. ఇది కాకుండా, iPhone 16 128GB, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌తో సహా అనేక బహుమతులు ఉన్నాయి.

Tags:    

Similar News