Best Mileage Bikes Under 1 Lakh: లక్ష కంటే తక్కువ ధర.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే స్ప్లెండర్ లాంటి బైక్స్ ఇవే..!
తక్కువ ధరలో మంచి పర్ఫామెన్స్, బెస్ట్ మైలేజ్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ కథనంలో పేర్కొన్న ఐదు బైక్ ల నుంచి బెస్ట్ బైక్ ను సెలక్ట్ చేసుకోవచ్చుచ.
Best Mileage Bikes Under 1 Lakh: తక్కువ ధరలో మంచి పర్ఫామెన్స్, బెస్ట్ మైలేజ్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ కథనంలో పేర్కొన్న ఐదు బైక్ ల నుంచి బెస్ట్ బైక్ ను సెలక్ట్ చేసుకోవచ్చుచ. విశేషం ఏంటంటే.. దీని ధర కూడా రూ. లక్ష కంటే కూడా తక్కువ. హీరో స్ప్లెండర్ కాకుండా ఇవి మార్కెట్లో ఉన్న ఇతర చీఫ్ అండ్ బెస్ట్ బైక్స్ ఇవే. ఈ బైక్‌లలో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్ కంపెనీ, హోండా 2-వీలర్స్ నుండి బైకులు ఉన్నాయి.
లక్ష లోపే లభించే బైక్స్ ఇవే..
టీవీఎస్ రైడర్ 125: టీవీఎస్ మోటార్ రైడర్ 125 బైక్ 6 విభిన్న వేరియంట్‌లలో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,000 నుండి మొదలై రూ. 1.04 లక్షల వరకు ఉంటుంది. ఇందులో, కంపెనీ 125సిసి ఇంజన్‌ను అందిస్తుంది, ఇది 11.2 బిహెచ్‌పి పవర్ , 11.75 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 67 కి.మీ.
హోండా ఎస్పీ 125: రూ. 1 లక్ష కంటే తక్కువ ధర కలిగిన సరసమైన బైక్‌లలో హోండా ఎస్ పీ 125 కూడా ఉంది. ఇందులో 123.94సీసీ ఇంజన్ ఉంది, ఇది 10.72 బిహెచ్‌పి పవర్, 10.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.87,468. దీని మైలేజ్ లీటరుకు 65 కి.మీ.
హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్: హీరో మోటో కార్ఫ్ ఈ బైక్ కూడా ఈ శ్రేణిలో అద్భుతమైనదని చెప్పొచ్చు. దీని ప్రారంభ ధర రూ.95,000. ఇందులోని 125సీసీ ఇంజన్ 11.4 బిహెచ్‌పి పవర్, 10.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 66కిలో మీటర్లు.
బజాజ్ పల్సర్ ఎన్125: బజాజ్ పల్సర్ ఎన్ 125 ధర రూ. 92,704 నుండి మొదలై రూ. 96,704 వరకు ఉంటుంది. ఇందులో 125సీసీ ఇంజన్ ఉంది, ఇది 11.8 బిహెచ్‌పి పవర్, 11ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 60 కిలో మీటర్లు.
బజాజ్ పల్సర్ ఎన్ ఎస్ 125: బజాజ్ ఈ బైక్ ఒక లక్ష కంటే ఎక్కువ, కానీ ఇది రూ. లక్ష పరిధిలోకే వస్తుంది. దీని ధర రూ.1.01 లక్షలు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 కూడా బజాజ్ ఎన్ 125 వలె అదే ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది లీటరుకు 60 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది.