Discount on Cars 2024: 14 కార్లపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్... లక్షల రూపాయలు ఆదా

Update: 2024-12-13 15:30 GMT

Cars on Discount sale 2024: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? సంవత్సరాంతం కావడంతో ఆటోమొబైల్ కంపెనీలు అనేక వాహనాలపై బంపర్ డిస్కౌంట్ల ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. కొనుగోలు చేయడానికి ముందు ఈ 14 వాహనాలపై లభించే భారీ డిస్కౌంట్లను పరిశీలించండి. మొత్తం 14 వాహనాలపై లభించే తగ్గింపుల గురించి ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం. ఇందులో టయోటా, మారుతి, ఎంజీ హెక్టర్, మహీంద్రా థార్, జీప్ కంపాస్ వాహనాలు ఉన్నాయి.

మారుతి గ్రాండ్ విటారా

మారుతి గ్రాండ్ విటారాను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఆ కారుపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు చాలా స్టైలిష్‌గా ఉండటంతో పాటు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడం ద్వారా లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ ధర రూ. 13.15 లక్షల నుండి రూ. 19.93 లక్షల వరకు ఉంది. దీనిపై కంపెనీ రూ. 1.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

టయోటా తైసోరో

టొయోటా పాపులర్ ఎస్ యూవీపై కూడా భారీ తగ్గింపు అందిస్తోంది. ఇది 10 లక్షల కంటే తక్కువ ధరకే వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.73 లక్షల నుండి రూ.12.87 లక్షల మధ్య ఉంది. దీనిపై కంపెనీ లక్ష రూపాయల

వరకు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది.

మారుతీ జిమ్నీ

మారుతి జిమ్నీ ఒక పవర్‌ఫుల్ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాహనాల కంటే దీని డిజైన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇది రహదారిపై దూసుకెళ్లేటప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీని ధర రూ. 12.74 లక్షల నుండి రూ. 14.79 లక్షల వరకు ఉంటుంది. దీనిపై మారుతి కంపెనీ రూ.2 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపుతో ఈ కారును కొనుగోలు చేయడం బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

ఎంజీ హెక్టర్

ఎంజీ హెక్టర్‌లో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ఈ ఎస్‌యూవీలో అధునాతన సాంకేతికతను అమర్చారు. ఈ ప్రీమియం కారు ధర రూ.14 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుంది. ఎంజీ దీనిపై రూ.2 లక్షల వరకు భారీ తగ్గింపును అందిస్తోంది.

ఈ వాహనాలు కాకుండా అనేక ఇతర కార్లపై తగ్గింపును పొందవచ్చు. ఆ వివరాలను ఇక్కడ పరిశీలిద్దాం. జీప్ కంపాస్‌లో రూ. 3.2 లక్షలు ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. మహీంద్రా థార్‌పై రూ. 3 లక్షల వరకు తగ్గింపు పొందుతున్నారు. మారుతీ స్విఫ్ట్‌పై రూ. 60 వేలు, మారుతి వ్యాగనార్‌పై రూ. 45 వేలు, MG ZS EVపై రూ. 1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇవేకాకుండా, Toyota Hyryder పై రూ. 1.6 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.

Tags:    

Similar News