Best Selling SUV: అత్యధికంగా అమ్ముడవుతున్న SUV ఇదే.. 25 కి.మీల మైలేజీ.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరంతే..!

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడవుతున్న SUV.

Update: 2023-07-27 09:13 GMT

Best Selling SUV: అత్యధికంగా అమ్ముడవుతున్న SUV ఇదే.. 25 కి.మీల మైలేజీ.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరంతే..!

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడవుతున్న SUV. జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన SUVల జాబితాలో ఇది చేరింది. ఇది సబ్-4 మీటర్ల SUV. దీని ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 14.14 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంటుంది. దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గత సంవత్సరం ప్రారంభించారు. ఇందులో అనేక కొత్త ఫీచర్లు జోడించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతి బ్రెజ్జా నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది - LXI, VXI, ZXI, ZXI+. టాప్ ట్రిమ్ ZXI+ మినహా అన్ని ట్రిమ్‌లలో CNG వేరియంట్‌ల ఎంపిక అందుబాటులో ఉంది. దీని ZXI, ZXI ప్లస్ ట్రిమ్‌లు బ్లాక్ ఎడిషన్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఇది ఆరు మోనోటోన్, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది 328 లీటర్ల బూట్ స్పేస్‌ను పొందుతుంది. CNG వేరియంట్‌లో బూట్ స్పేస్ తగ్గుతుంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 101 PS పవర్, 136 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను పొందుతుంది.

అదే ఇంజన్ CNG వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే పవర్ అవుట్‌పుట్ 88 PS, 121.5 Nm. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. మారుతి బ్రెజ్జా MT 20.15KMPL, బ్రెజ్జా AT - 19.8KMPL, బ్రెజ్జా CNG MT 25.51 KMPKG మైలేజీని అందిస్తుంది.

ఇది 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాడిల్ షిఫ్టర్స్ (ఆటోమేటిక్ వేరియంట్), సన్‌రూఫ్, నాలుగు స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను పొందుతుంది.

భద్రత గురించి మాట్లాడితే.. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBD, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News