Ola and TVS Electric Scooter Battery Price: ఓరి దేవుడా.. ఇలా మోసపోయాం ఏంట్రా.. ఈవీ బ్యాటరీ రేట్లు చూస్తే..!

Ola and TVS Electric Scooter Battery Price: ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్ బ్యాటరీ ప్యాక్ ధరలు బయటకు వచ్చాయి. ఒక్కొదాని కోసం రూ.80 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Update: 2024-09-18 13:27 GMT

Ola and TVS Electric Scooter Battery Price

Ola and TVS Electric Scooter Battery Price: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఓలా, టీవీఎస్‌ల ఆధిపత్యం పెరుగుతోంది. ఈ విభాగంలో రెండు కంపెనీలు మొదటి, రెండవ స్థానాల్లో పోటీపడుతున్నాయి. ఈ రెండు స్కూటర్లు కూడా వేర్వేరు వేరియంట్లలో వస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో ప్రధాన భాగం దాని బ్యాటరీ, మోటారు. బ్యాటరీ ధర వాహనం మొత్తం ధరలో సగం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేసేముందు మీరు ఈ స్కూటర్ల బ్యాటరీల ధరను తెలుసుకోవాలి. బ్యాటరీలలో ఏదైనా లోపం ఉన్నా, లేదా వాటి వారంటీ గడువు ముగిసినట్లయితే మీరు వాటి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది.

OLA Electric Scooter Battery Price
గత సంవత్సరం ఓలా స్కూటర్ బ్యాటరీ ధరల వివరాలను సోషల్ మీడియా వినియోగదారు షేర్ చేశారు. అతను షేర్ చేసిన ఫోటోలో S1, S1 ప్రో బ్యాటరీ ప్యాక్ ధరలు ఉన్నాయి. రేంజ్ ప్రకారం Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉపయోగించే 2.98 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ.66,549. అదే సమయంలో Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉపయోగించిన 3.97 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ. 87,298. ఇప్పుడు కూడా ఈ బ్యాటరీల ధర దాదాపు 60 నుంచి 70 వేల రూపాయలు.

TVS iQube Battery Price
టీవీఎస్ iQube iQube, iQube S, iQube ST 3 డిఫరెంట్ వేరియంట్‌లలో ఉంటుంది. దాని టాప్ మోడల్‌లో కంపెనీ 3.4 kWh కెపాసిటీ గల నాన్-రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం ఇది ఫుల్ ఛార్జింగ్ పై 145కిమీల రేంజ్ ఇస్తుంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక అప్‌గ్రేడ్‌లు చేసింది. అలానే ఇప్పుడు అనేక చౌకైన వేరియంట్లు కూడా ఇందులో ఉన్నాయి. నివేదిక ప్రకారం ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌ను మార్చడానికి అయ్యే ఖర్చు రూ.56,000 నుండి రూ.70,000 వరకు ఉంటుంది. కంపెనీ బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని కూడా ఇస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకంలో కూడా బజాజ్ చేతక్ ఆధిపత్యం కనిపిస్తుంది. ఈ స్కూటర్ 3 kW బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటుంది. అదే సమయంలో కంపెనీ ఇటీవలే విభిన్న బ్యాటరీ బ్యాక్‌లతో తన వేరియంట్‌లను కూడా విడుదల చేసింది. ఇతర కంపెనీల మాదిరిగానే బజాజ్ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీపై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అయితే బ్యాటరీ పాడైపోయినా, లేదా బ్యాటరీ వారంటీ గడువు ముగిసినా రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News