Maruti Top Selling Car: బుడ్డి బడ్జెట్ కారు.. 50 లక్షల మంది కొన్నారు.. రికార్డులు ఊడ్చేస్తుంది..!

Maruti Top Selling Car: మారుతి సుజికి ఇండియా ఆల్టో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. ఇప్పటికీ 50 లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

Update: 2024-09-18 10:26 GMT

maruti alto k10

Maruti Top Selling Car: మారుతి సుజికి ఇండియా ఆల్టో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. 2000 సంవత్సరం నుండి అంటే 24 సంవత్సరాలలో 50 లక్షలకుపైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇన్ని సంవత్సరాలకు కూడా ప్రతి నెలా 10 వేల మందికి పైగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. దేశంలో అత్యంత చవకైన కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.99లక్షలు. 1982లో మారుతి సుజికి భాగస్వామ్యం తర్వాత సెప్టెంబర్ 27, 2000 సంవత్సరంలో ఆల్టో దేశీయ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

Maruti Alto K10 Specifications
ఆల్టో K10 కారు కంపెనీ అప్‌డేటెడ్ ప్లాట్‌ఫామ్ Heartect ఆధారంగా డిజైన్ చేశారు. ఈ హ్యాచ్‌బ్యాక్ కొత్త-జెన్ K-సిరీస్ 1.0L డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 66.62PS పవర్, 5500rpm, గరిష్ట టార్క్ 89Nm, 3500rpm వద్ద రిలీజ్ చేస్తుంది. దాని ఆటోమేటిక్ వేరియంట్ 24.90 km/l మైలేజీని ఇస్తుంది. మాన్యువల్ వేరియంట్ 24.39 km/l మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే దాని CNG వేరియంట్ మైలేజ్ 33.85 kmpl.

ఆల్టో కె10లో 7 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. S-Presso, Celerio, Wagon-Rలలో కంపెనీ ఇప్పటికే ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించింది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కాకుండా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ USB, బ్లూటూత్, ఆక్స్ కేబుల్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. స్టీరింగ్ వీల్‌కు కూడా కొత్త డిజైన్‌లో తీసుకొచ్చారు. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మౌంటెడ్ కంట్రోల్ స్టీరింగ్‌పైనే అందించారు.

ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ఉంటుంది. దీనితో పాటు, ఆల్టో కె10 ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిట్ ఫ్రంట్ సీట్ బెల్ట్‌ను పొందుతుంది. సురక్షితమైన పార్కింగ్ కోసం రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్ వంటి అనేక ఇతర భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఆల్టో తొలిసారిగా సెప్టెంబర్ 27, 2000న భారత మార్కెట్లో విడుదలైంది. అప్పుడు దాని మోడల్ విదేశీ మార్కెట్లో విక్రయించబడిన 5వ తరం ఆల్టో నుండి ప్రేరణ పొందింది. ఆల్టో తదుపరి తరం మోడల్ అక్టోబర్ 16, 2012న ప్రారంభారు. ఈ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ దాని మంచి లుక్స్, ఫీచర్లతో అప్పట్లో మార్కెట్‌ను కైవసం చేసుకుంది. అప్పుడు దాని మైలేజ్ 24.7 kmpl వరకు ఉంది. కస్టమర్లను ఆకర్షించడంలో విజయవంతమైంది.

2015 సంవత్సరంలో ఆల్టో కొత్త, శక్తివంతమైన 1.0 లీటర్ K10B ఇంజన్‌తో పరిచయం చేయబడింది. ఆ తర్వాత ఇది మెరుగైన పనితీరు, ఫ్యూయల్ ఖర్చులను తగ్గించే కారుగా మారింది. ఆల్టో కె10 5 స్పీడ్ మ్యాన్యువల్ అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో అందించారు. ఆల్టో CNG ఎంపికలో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని మైలేజ్ కిలోకు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఇది గ్లోబల్ NCAPలో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

Tags:    

Similar News