Kia Carnival: అబ్బా ఏమి క్రేజ్ రా నాయనా.. కార్నివాల్ ఫీచర్లు చూస్తే బిత్తరపోతారు.. ఇది కార్ కాదు పెద్ద పడవ..!

Kia Carnival: కియా కార్నివాల్ ఎమ్‌పివి బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే 1822కు పైగా బుకింగ్స్ వచ్చాయి. దాని సెగ్మెంట్‌లో ఇది సరికొత్త రికార్డ్.

Update: 2024-09-18 08:21 GMT

kia carnival 2024

Kia Carnival: కియా ఇండియా కార్నివాల్ ఎమ్‌పివి లాంచ్ కాకముందే కార్ లవర్స్ నుంచి గొప్ప స్పందన లభిస్తుంది. సెప్టెంబర్ 16 నుంచి కంపెనీ కార్నివాల్ బుకింక్స్ ప్రారంభించింది. మరో విశేషమేమిటంటే.. బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే 1822కు పైగా బుకింగ్స్ వచ్చాయి. దాని సెగ్మెంట్‌లో ఇది సరికొత్త రికార్డ్. గతేడాది కియా కార్నివాల్ అమ్మకాల నిలపివేసింది. అయితే ఇప్పుడు మరోసారి రోడ్లపైకి రానుంది. కంపెనీ అక్డోబర్ 3న కార్నివాల్‌ను విడుదల చేయనుంది. అడ్వాస్ బుకింగ్ కోసం రూ.2 లక్షలు టోకన్ అమోంట్‌గా ఫిక్స్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉంటుంది.

కార్నివాల్‌ను బుక్ చేసుకోవడానికి కస్టమర్‌ల నుండి వచ్చిన అద్భుతమైన స్పందన గురించి కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జున్సూ చో మాట్లాడుతూ.. కొత్త కార్నివాల్ కొత్త ప్రమాణాలను నెలకొల్పడం మాకు గర్వకారణం. కార్నివాల్ లిమౌసిన్ సెగ్మెంట్‌ను తిరిగి ముందంజలో ఉంచుతుందని మేము విశ్వసిస్తున్నాము. దాని ప్రత్యేక డిజైన్, ఉత్తేజకరమైన ఫీచర్లు, సెగ్మెంట్-ఫస్ట్ టెక్నాలజీతో, కార్నివాల్ పరిశ్రమ ప్రమాణాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

కొత్త కార్నివాల్ డిజైన్ గురించి మాట్లాడితే కొత్త కార్నివాల్‌లో క్రోమ్ ఎలిమెంట్స్‌తో కూడిన పెద్ద టైగర్ నోస్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు, ఇన్‌వర్టెడ్ L-ఆకారపు LED DRLలు, స్లైడింగ్ సిస్టమ్, బ్యాక్ డోర్‌పై రిక్వెస్ట్ సెన్సార్, కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇది 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పాటు యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

కార్నివాల్‌ ఇంటీరియర్‌లో వెంటిలేటెడ్ రియర్ సీట్లు, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్లు, డ్యూయల్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 12.3-అంగుళాల స్క్రీన్‌లు, బోస్ సోర్స్డ్ 12-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్‌లు ఉంటాయి. ఇది HUD, డిజిటల్ రియర్-వ్యూ మిర్రర్ కూడా ఉంటుంది.

కార్నివాల్‌ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 2.2 లీటర్, 4 సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఇది 200ps పవర్‌ని, 440Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అటాచ్ చేసి ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఈ లగ్జరీ కారులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS 2 సూట్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీన్ని వేర్వేరు సీట్ల ఆప్షన్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News