ZELIO E bike: వారెవ్వా.. డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారుల కోసం స్పెషల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 150 కిలోల బరువు మోస్తుంది..!

ZELIO E bike: జెలియో బైక్స్ ఈ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్ LOGIX‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

Update: 2024-09-16 11:36 GMT

ZELIO E bike

ZELIO E bike: భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీల్లో జెలియో బైక్స్ కూడా ఒకటి. ఇప్పుడు కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ లైనప్‌ను పెంచడానికి కొత్త వేరియంట్ ప్రారంభించబోతోంది. ఇటీవల కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ఫోటోను విడుదల చేసింది. త్వరలో సేల్‌కు రానున్న ఈ ఎలక్ట్రిక్ వాహనం భారతదేశంలోని కార్గో టూ-వీలర్ సెగ్మెంట్ కోసం తీసుకొస్తున్నారు. ఈ స్కూటర్ ప్రత్యేకంగా వస్తువులను తీసుకెళ్లడానికి రెండు వాహనాలను ఉపయోగించే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మీరు వ్యాపారం కోసం కూడా ఈ స్కూటర్‌ని ఉపయోగించవచ్చు. ఈ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్ LOGIX పేరుతో మార్కెట్‌లోకి రానుంది. కార్గో వినియోగానికి అనుగుణంగా ఈ స్కూటర్‌లో అనేక ప్రత్యేక ఫీచర్లు ఇవ్వబడినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ 150 కిలోల బరువున్న వస్తువులను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇంత భారీ బరువును మోస్తున్నప్పటికీ, ఫుల్‌ ఛార్జింగ్‌పై 90 కి.మీల రేంజ్‌ను అందిస్తుందని వెల్లడించింది.

దీని మరో ప్రత్యేకత ఏమిటంటే దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలకు ఎలాంటి లైసెన్సు అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాహనాలు చిరు వ్యాపారులకు లాభదాయకమైన డీల్ అని ప్రతి కోణంలోనూ కనిపిస్తోంది. అందువల్ల డెలివరీ సర్వీసెస్‌లో ఉండే వారి నుంచి ఈ వాహనానికి మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతారు.

ప్రస్తుతం ఈ స్కూటర్‌కు సంబంధించిన గ్లింప్స్ మాత్రమే వెల్లడయ్యాయి. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ఇది సెప్టెంబర్‌లో జూలియో ఈబైక్స్ బ్రాండ్ అన్ని అవుట్‌లెట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కంపెనీ ఇంకా ఈ స్కూటర్ ఫోటోలను విడుదల చేయలేదు. అలానే ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో ప్రకటించలేదు. ఈ ఈ-స్కూటర్‌కి సంబంధించి ఇప్పటి వరకు ఒకే ఒక్క టీజర్‌ చిత్రం విడుదలైంది. వెహికల్ లాంచ్ తర్వాత మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News