Electric Car Under 5 Lakh: రూ. 5 లక్షల లోపు వచ్చే బెస్ట్ మైలేజీ వచ్చే కార్లు ఇవే.. త్వరగా కొనేయండి..!

Electric Car Under 5 Lakh: కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉందని చింతిస్తున్నారా.

Update: 2024-11-23 11:04 GMT

Electric Car Under 5 Lakh: రూ. 5 లక్షల లోపు వచ్చే బెస్ట్ మైలేజీ వచ్చే కార్లు ఇవే.. త్వరగా కొనేయండి..!

Electric Car Under 5 Lakh: కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉందని చింతిస్తున్నారా. అయితే ఈ కారు మీకు బెస్ట్ ఆఫ్షన్ గా ఉంటుందనడంతో ఎలాంటి సందేహం లేదు. మీరు రూ.5 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయగల కొన్ని కొత్త కార్ల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం. ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఏళ్ల తరబడి బడ్జెట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న కాస్తో కూస్తో డబ్బులు ఈ కారును కొనుగోలు చేయడానికి సరిపోతాయి. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో రెనాల్ట్, ఎంజీ మోటార్స్, మారుతీ సుజుకీ కంపెనీల కార్లు ఉన్నాయి. అన్ని కార్ల వివరాలను ఈ కథనంతో తెలుసుకుందాం. ఈ ధర వద్ద పెట్రోల్-సిఎన్‌జి రన్నింగ్ కారు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కారు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మోడళ్ల ధర ఎంత, అవి ఎంత మైలేజీని అందిస్తాయో చూద్దాం.

ఎంజీ కామెట్ ఈవీ

ఈ ఎలక్ట్రిక్ కారు ఎంజీ బాస్ ప్లాన్‌తో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షలు. ఈ కారు చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. కామెట్ ఈవీని 3.5 గంటల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు మంచి డ్రైవింగ్ పరిధిని కూడా అందిస్తుంది. ఈ కారు ఫుల్ ఛార్జింగ్ పై 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ ప్లాన్‌లో కిలోమీటరుకు బ్యాటరీ అద్దె రూ.2.5 చెల్లించాల్సి ఉంటుందని, ఈ పే పర్ కిలోమీటరు పథకం ద్వారా ధరను అంతగా తగ్గించింది. మీరు బ్యాటరీ అద్దె ఆప్షన్ కు వెళ్లకపోతే.. ఈ కారు మీకు రూ. 6 లక్షల 98 వేలు (ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర) ఖర్చవుతుంది.

రెనాల్ట్ క్విడ్ ధర, మైలేజీ

ఈ కారు ధర రూ. 4 లక్షల 69 వేల 500 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర హ్యాచ్‌బ్యాక్ బేస్ వేరియంట్ కోసం, టాప్ వేరియంట్ వైపు వెళితే, దీని కోసం మీరు రూ. 6 లక్షల 44 చెల్లించాలి. మీరు దాని RXE 1.0L, RXL(O) 1.0L, RXL(O) నైట్ & డే ఎడిషన్ 1.0L వేరియంట్‌లను రూ. 5 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్ 21.46 నుండి ఒక సారి ఛార్జ్ చేస్తే 22.3కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి ఆల్టో కె10

మారుతి సుజుకి ఈ సరసమైన కారు అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఉండే ఈ కారును ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. కారు పెట్రోల్ (మాన్యువల్) వేరియంట్ లీటరుకు 24.39కిలోమీటర్లు, పెట్రోల్ (ఆటో గేర్ షిఫ్ట్) వేరియంట్ లీలరుకు24.90కిలోమీటర్లు, సీఎన్జీ వేరియంట్ కిలోకు 33.8కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3 లక్షల 99 వేల నుండి రూ. 5 లక్షల 96 వేల వరకు ఉంది.

Tags:    

Similar News