Renault Duster: బడ్జెట్ రెడీ చేస్కోండి.. మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త రెనాల్ట్ డస్టర్
Renault Duster: న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ మార్చి 2025లో దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది.
Renault Duster: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో మిడ్-సైజ్ ఎస్ యూవీ విభాగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి ఎస్ యూవీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన పాపులర్ ఎస్‌యూవీ డస్టర్‌లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వార్తా వెబ్‌సైట్ gaadiwaadiలో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం.. రెనాల్ట్ డస్టర్ ఫేస్‌లిఫ్ట్ వచ్చే ఏడాది అంటే 2025లో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ మార్చి 2025లో దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఇది కాకుండా, కంపెనీ కొత్త తరం రెనాల్ట్ డస్టర్‌ను భారతీయ రోడ్లపై అధికారికంగా టెస్టింగ్ ప్రారంభించింది. టెస్టింగ్ సమయంలో కనిపించిన కొత్త డస్టర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పై షాట్‌లు రాబోయే ఎస్ యూవీని అప్ డేటెడ్ టెయిల్ ల్యాంప్ లేఅవుట్, కొత్త వెనుక డోర్ హ్యాండిల్స్‌ను చూపిస్తున్నాయి. అప్‌డేట్ చేయబడిన రెనాల్ట్ డస్టర్ లుక్ గ్లోబల్ వెర్షన్‌ను పోలి ఉంటుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
కొత్త రెనాల్ట్ డస్టర్ లోపలి భాగం పూర్తిగా రీడిజైన్ చేయబడింది, పూర్తి స్టైలిష్ గా క్యాబిన్ ను డిజైన్ చేశారు. ఈ ఎస్ యూవీ క్యాబిన్‌లో అందంగా కనిపించేందుకు త్రీ-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, షార్ట్ గేర్ లివర్, అప్‌డేటెడ్ అప్హోల్స్టరీ , 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. మరోవైపు, రాబోయే డస్టర్‌కి పవర్‌ట్రెయిన్‌గా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వవచ్చు.
గ్లోబల్-స్పెక్ కొత్త రెనాల్ట్ డస్టర్ వెలుపలి భాగంలో కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సి-ఆకారపు టెయిల్ ల్యాంప్స్, సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రెయిల్స్, రెండు వైపులా బాడీ క్లాడింగ్‌తో కూడిన కొత్త రియర్ బంపర్ ఉన్నాయి. ముందు భాగంలో, ఇది Y- ఆకారపు LED డే టైం రన్నింగ్ లైట్లు, కొత్త గ్రిల్, బంపర్‌పై ఎయిర్ వెంట్లు, పెద్ద స్కిడ్ ప్లేట్ కలిగి ఉంటుంది.