Hero Centennial: ఇదేం క్రేజ్ రా బాబూ.. రూ.2 లక్షల బైక్‌ని రూ. 8 కోట్లకు కొన్నారు.. అంతగా ఏముంది అంటారు..!

Hero Centennial: హీరో సెంటెనియల్‌ బైక్‌ని వేలం వేయగా 20.30 లక్షల రూపాయలు పలికింది. ఇది 210సీసీ హై పవర్ ఇంజన్‌ కలిగి ఉంటుంది.

Update: 2024-09-16 13:13 GMT

hero centennial

Hero Centennial: హీరో మోటోకార్ప్ బైకులు మార్కెట్‌లో ఎంతో ప్రసిద్ధి చెందాయి. కంపెనీ ఎంట్రీ లెవల్ నుండి రేసర్ వరకు ప్రతి సెగ్మెంట్‌లో కూడా అనేక బైకులను అందిస్తోంది. అయితే కంపెనీ ఇటీవలే తన కొత్త జనరేషన్ బైక్ హీరో సెంటెనియల్‌ను విక్రయిచడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. ఈ బైక్ వేలం నిర్వహించి 8.6 కోట్లను సేకరించింది. ఈ డబ్బును స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ బైక్ అసలు ధర ఎంత, దీని ఫీచర్లు తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో సెంటెనియల్‌ అనేది కంపెనీ Hero Karizma XMR ఆధారంగా రూపొందించబడిన బైక్. దీని ప్రారంభ ధర రూ. 2 లక్షలు. హీరో సెంటెనియల్‌లో కేవలం 100 మోటార్‌సైకిళ్లు మాత్రమే తయారు చేయబడ్డాయి. ప్రతి మోటార్‌సైకిల్ అభిరుచి, ఇంజనీరింగ్‌కు ఉదాహరణ అని కంపెనీ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇటీవలే సెంటెనియల్ వేలం నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. వేలంలో పాల్గొన్న డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపార భాగస్వాములు, కంపెనీ ఉద్యోగులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేలంలో అత్యధికంగా రూ.20.30 లక్షలు పలికింది. మొత్తం 75 మోటార్‌సైకిళ్ల వేలం ద్వారా దాదాపు రూ.8.58 కోట్లు వసూలు చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఈ విషయమై కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. సెంటెనియల్ భారీ విజయం మా చైర్మన్ డాక్టర్ బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్‌కు ఉన్న ప్రజాదరణకు సరితూగుతుందని అన్నారు. ఈ పని ఆయన విలువలకు గుర్తింపు అని, ఆయన మిగిల్చిన గొప్ప వారసత్వానికి నిజమైన నివాళి అని అన్నారు. హీరో సెంటెనియల్‌లో కంపెనీ 210సీసీ హై పవర్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. బైక్ మొత్తం బరువు 158కిలోలు. దీన్ని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు.

హీరో సెంటెనియల్ అనేది స్పీడెస్ట్ బైక్. దీనిలో రైడర్ భద్రత కోసం ముందు, వెనుక టైర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. బైక్ స్టైలిష్ ఎగ్జాస్ట్‌తో సౌకర్యవంతమైన సీట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ బ్లాక్, రెడ్ డ్యూయల్ కలర్‌లలో వస్తుంది. బైక్‌లో అల్లాయ్ వీల్స్, కంఫర్ట్‌బుల్ రైడ్ కోసం హెవీ సస్పెన్షన్ పవర్ ఉన్నాయి. బైక్‌కు సాధారణ హ్యాండిల్‌బార్, LED లైట్లు అందించారు.

Tags:    

Similar News