New Tata Punch Launched: పంచ్ అప్‌గ్రేడ్ మోడల్ లాంచ్.. అన్నిటికీ ఇచ్చిపడేసింది.. కారులో ఏం మారిందంటే..?

New Tata Punch Launched: టాటా మోటర్స్ తన ఫేమస్ ఎస్‌యూవీ పంచ్ అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.12 లక్షల ప్రారంభమవుతుంది.

Update: 2024-09-17 12:31 GMT

New Tata Punch

New Tata Punch Launched: టాటా మోటర్స్ తన ఫేమస్ ఎస్‌యూవీ పంచ్ అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసింది. కంపెనీతో పాటు దేశంలోనూ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ ఇదే. గత కొన్ని నెలలుగా ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా కూడా నిలిచింది. కొత్త పంచ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన గ్రాండ్ కన్సోల్, వెనుక ఏసీ వెంట్, టైప్ సి ఫాస్ట్ యూఎస్‌బి ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అప్‌డేట్ చేయబడిన టాటా పంచ్‌కు కొత్త ఫీచర్లను జోడించడంతో పాటు ఇది కొత్త వేరియంట్‌లతో అప్‌గ్రేడ్ చేయబడింది. దీని డిజైన్, ఇతర ఫీచర్లు ఇప్పటికే ఉన్న మోడల్ మాదిరిగానే ఉన్నాయి. సన్‌రూఫ్‌తో కూడిన పంచ్ వేరియంట్‌లు ఇప్పుడు ముందు కంటే చౌకగా మారాయని కంపెనీ తెలిపింది. అడ్వెంచర్ ట్రిమ్‌కు కొత్త సన్‌రూఫ్ వేరియంట్‌లు యాడ్ చేశారు. మీరు ఈ మినీ SUVని 10 ట్రిమ్‌లలో ప్యూర్, ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ S, అడ్వెంచర్ + S, అకాంప్లిష్డ్ +, అకాంప్లిష్డ్ + S, క్రియేటివ్ + క్రియేటివ్ + ఎస్‌లలో కొనుగోలు చేయగలుగుతారు.

కొత్త పంచ్ SUV ఇంజన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో 1.2-లీటర్, పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లను కలిగి ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.6.12 లక్షల నుండి రూ.9.45 లక్షల వరకు ఉంది. టాటా పంచ్‌పై రూ.18,000 వరకు ప్రయోజనాలు కూడా ఇస్తున్నట్లు కార్ల తయారీ సంస్థ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో 4 లక్షల అమ్మకాల మార్కును దాటిన అత్యంత వేగవంతమైన SUVగా ఇది నిలిచింది. కంపెనీ అప్‌గ్రేడ్ చేయబడిన పంచ్ మోడల్‌ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

టాటా పంచ్ కూడా EV వేరియంట్‌తో వస్తుంది. ఈ కారు గ్లోబల్ NCAP సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. టాటా పంచ్ LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్‌లను కలిగి ఉంది. ఇది పవర్ విండోస్, 16 అంగుళాల టైర్ సైజుతో వస్తుంది. ఈ కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారులో డ్యూయల్ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Tags:    

Similar News