BMW New Bikes: మహీంద్రా థార్ కంటే ఈ రెండు బైకుల ధరే ఎక్కువ.. వీటిపై రైడ్ అంటే ఏనుగు మీద సవారే..!

BMW New Bikes: బిఎండబ్ల్యూ మోటర్స్ భారతదేశంలో F 900 GS, F 900 GS అడ్వెంచర్ బైక్‌లను విడుదల చేసింది. వీటిని రూ.15 లక్షల్లోపు కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-17 09:38 GMT

BMW F 900 GS, BMW F 900 GS Adventure

BMW New Bikes: బిఎండబ్ల్యూ మోటర్స్ భారతదేశంలో F 900 GS, F 900 GS అడ్వెంచర్ బైక్‌లను విడుదల చేసింది. F 900 GS ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.75 లక్షలు, F 900 GS అడ్వెంచర్ ధర రూ. 14.75 లక్షలు. ఈ అడ్వెంచర్ బైకులు పూర్తిగా బిల్ట్ యూనిట్ (CBU)గా అందుబాటులో ఉంటుంది. వీటి డెలివరీలు అక్టోబర్ 2024 నుండి ప్రారంభమవుతాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న F 900 ట్విన్స్ స్థానంలో F 850 ​​GS వచ్చింది. ఇవి దాదాపు ముందు వేరియంట్ల కంటే బెటర్‌గా ఉంటాయి.

ఈ రెండు బైకులు 895cc, ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఇది మునుపటి 853cc యూనిట్‌ను రీప్లేస్ చేస్తుంది. పవర్, టార్క్ అవుట్‌పుట్ సంఖ్యలు కూడా పెరిగాయి. ఇది 8500rpm వద్ద 105bhp, 6750rpm వద్ద 93Nm టార్క్‌గా మారింది. మోటార్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇంజన్ బ్రిడ్జ్-టైప్ ఛాసిస్ మీద ఉంటుంది, ఇది అల్యూమినియం స్వింగార్మ్ సహాయంతో వెనుక వీల్‌కి కనెక్టై ఉంటుంది. ఇది నేరుగా సెంట్రల్ స్ప్రింగ్ స్ట్రట్‌కు అనుసంధానించబడి ఉంది.

రెండు బైక్‌లు వాటి కొలతలు, బరువు, ఇతర కొన్ని ఫీచర్ల పరంగా భిన్నంగా ఉంటాయి. స్టాండర్డ్ F 900 GS అనేది మినిమలిస్ట్, ర్యాలీ-స్టైల్ బాడీవర్క్, 226 కిలోల తక్కువ కర్బ్ బరువుతో మరింత ఆఫ్-రోడ్-సెంట్రిక్ బైక్. ఇది చిన్న 14.5-లీటర్ ఫ్యూయట్ ట్యాంక్‌ కలిగి ఉంటుంది. అడ్వెంచర్ ట్రిమ్ అనేది పెద్ద 23-లీటర్ ఇంధన ట్యాంక్, పెద్ద సీటుతో కూడిన ఆల్ రౌండర్. దీని గరిష్ట వేగం గంటకు 200 కి.మీ.

ఫీచర్ల గురించి చెప్పాలంటే, రెండు బైక్‌లలో మల్టీ రైడింగ్ మోడ్‌లు, పవర్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్, ABS, బై డైరేక్షనల్ క్విక్ షిఫ్టర్, పెద్ద 6.5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉన్నాయి. BMW F 900 GS స్టైల్ ప్యాషన్ (సావో పాలో ఎల్లో), GS ట్రోఫీ (లైట్ వెయిట్/రేసింగ్ బ్లూ మెటాలిక్)తో సహా రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మరోవైపు, F 900 GS అడ్వెంచర్ బ్లాక్ స్టార్మ్ మెటాలిక్, వైట్ అల్యూమినియం మ్యాట్‌తో సహా రెండు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది.

Tags:    

Similar News