95 సెకన్లలో 100 కి.మీలవేగం.. 490 కి.మీల మైలేజ్.. 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర వింటే షాకే..!
Lotus Eletre SUV: బ్రిటిష్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ లోటస్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
Lotus Eletre SUV: బ్రిటిష్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ లోటస్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. కంపెనీ తన Eletre ప్యూర్ ఎలక్ట్రిక్ SUVని రూ. 2.55 కోట్ల ప్రారంభ ధరతో విడుదల చేసింది. Lotus Eletre లైనప్‌లో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది – Eletre, Eletre S, Eletre R. వాటి ధరలు వరుసగా రూ. 2.55 కోట్లు, రూ. 2.75 కోట్లు, రూ. 2.99 కోట్లు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియా)గా నిలిచింది.
పవర్‌ట్రెయిన్, రేంజ్: ఇది రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. Eletre, Eletre S 603bhp/710Nm డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్‌ను పొందుతాయి. ఈ కార్లు 600కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలవు. అయితే, Eletre R వేరియంట్ 905bhp/985Nm డ్యూయల్-మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 490కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదు.
బ్యాటరీ: 112kWh బ్యాటరీ ప్యాక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, AWD సిస్టమ్, టార్క్ వెక్టరింగ్, 5 డ్రైవ్ మోడ్‌లు, యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్ అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ ప్యాక్‌ను ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులో ప్రామాణికంగా 22kWh AC ఛార్జర్ కూడా ఉంది.
పనితీరు: Lotus Eletre R అనేది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ SUV. ఇది కేవలం 2.95 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 258 కి.మీ. దీని టాప్-టైర్ R వేరియంట్‌లో కార్బన్ ఫైబర్ ప్యాక్, హ్యాండ్లింగ్ ప్యాక్, హై-పెర్ఫార్మెన్స్ టైర్లు, గ్లోస్ బ్లాక్ వీల్స్ ఉన్నాయి.
ఫీచర్లు: వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, 12-వే పవర్డ్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెంట్రల్‌గా మౌంటెడ్ 15.1-అంగుళాల పూర్తి హై-డెఫినిషన్ OLED సెంటర్ స్క్రీన్, Apple CarPlay/Android ఆటో, 1,380-వాట్ 15-స్పీకర్ KEF హాస్. ప్రీమియం ఆడియో సిస్టమ్ అందుబాటులో ఉంది.