New Dzire Bookings: టైమ్ వచ్చేసింది.. కొత్త డిజైర్ బుకింగ్స్ ఓపెన్

Update: 2024-11-04 15:47 GMT

New Dzire Bookings: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన సెడాన్ కారు డిజైర్ బుకింగ్స్ ప్రారంభించింది. మీరు కేవలం రూ.11,000 చెల్లించి ఫోర్త్ జనరేషన్ డిజైర్‌ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం మీరు కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. కొత్త డిజైర్ నవంబర్ 11న భారత్‌లో విడుదల కానుంది. ఈసారి కొత్త డిజైర్‌లో పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈసారి డిజైర్ కొత్త Z-సిరీస్ ఇంజన్‌తో వస్తోంది. ఈ కారులో కొత్త Z-సిరీస్ 3 సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది దాదాపు 82 hp పవర్, 112 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో రూపొందించారు. ఈ ఇంజన్‌నే కొత్త స్విఫ్ట్‌కు కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది

మారుతి సుజుకి కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఇంజన్ ప్రత్యేకత ఏంటంటే.. కారు అద్భుతమైన మైలేజీతో దూసుకుపోతుంది. అంతేకాదు.. అన్ని సీజన్లలో మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ చెబుతోంది. కంపెనీ ప్రకటించిన డీటేల్స్ ప్రకారం ఈ కారు సుమారు 25 కిమీ నుండి 27 కిమీల మైలేజీని అందించే అవకాశం ఉంది. 

కొత్త డిజైర్‌లో భద్రతకు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు మారుతి సుజుకి స్పష్టంచేసింది. 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ + EBD, బ్రేక్ అసిస్ట్, డిస్క్ బ్రేక్, EPS, 6 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లను ఈ కారులో చూడొచ్చు. కొత్త మోడల్‌లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సేఫ్టీ ఫీచర్లు ఉండవచ్చని వార్తలొస్తున్నాయి. దీనిలో మొదటిసారిగా హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకొస్తోంది. ఇది కాకుండా కొత్త మోడల్‌లో సన్‌రూఫ్ కూడా ఉంది. ఈసారి కొత్త డిజైర్‌లో అనేక కొత్త స్పెషల్ ఫీచర్లు ఉన్నాయని మారుతి సుజుకి వెల్లడించింది. ఫస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ ఫీచర్లు కూడా ఉంటాయంటోంది.

కొత్త డిజైర్ పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉండబోతోంది. డిజైర్ కారు ఇప్పటికే సెడాన్ కార్ల విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు కొత్త కారు విడుదలైన తరువాత ఈ కారు అమ్మకాల రేంజ్ ఇంకా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త మోడల్ మరోసారి కస్టమర్ల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నామని కంపెనీ ధీమా వ్యక్తంచేసింది. భారతదేశంలో, కొత్త డిజైర్ నేరుగా హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి కార్లతో పోటీపడుతుందని మారుతి సుజుకి అభిప్రాయపడింది.

Tags:    

Similar News