SUV Mileage Increase: ఈ టిప్స్ పాటించండి.. కార్ మైలేజ్ పెంచుకోండి

SUV Mileage Increase: కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఎస్‌యూవీ మైలేజ్ పెంచొచ్చు.

Update: 2024-11-02 09:35 GMT

SUV Mileage Increase

SUV Mileage Increase: ఆటో మార్కెట్‌లో ఎస్‌యూవీతో సహా అనేక రకాల కార్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలలో పవర్‌ఫుల్ ఇంజన్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఇవి సాధారణ కార్లతో పోలిస్తే మెరుగైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిలో ఇంధన వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని మెయింటైన్ చేయాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న పనే అని చెప్పాలి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఎస్‌యూవీ మైలేజ్ పెంచొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయండి

సడెన్‌గ యాక్సిలరేట్ ఇవ్వడం, బ్రేక్ వేయడం ద్వారా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. స్థిరమైన వేగంతో నడపడానికి ప్రయత్నించండి. యాక్సిలరేటర్‌ను నెమ్మదిగా ఉపయోగించండి.

టైర్ ఒత్తిడిని తనిఖీ చేయండి

టైర్లో ఎప్పుడు సరిపడ గాలి ఉండేలా చూడండి. కనీసం వారానికి ఒకసారి టైర్ ఒత్తిడిని తనిఖీ చేయండి.

సన్‌రూఫ్‌ను సరిగ్గా ఉపయోగించండి

సన్‌రూఫ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు గాలి ఫ్లోని చెక్ చేయండి. సన్‌రూఫ్‌ను ఎక్కువసేపు తెరిచి ఉంచడం వల్ల గాలి ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇంధన వినియోగాన్ని కూడా పెంచుతుంది.

కారు క్రమం తప్పకుండా సర్వీస్‌ చేయండి

ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్‌ల వంటి వాటిని క్రమం తప్పకుండా చెక్ చేయండి. దీనివల్ల ఇంజిన్ సజావుగా నడుస్తుంది. పైగా ఇంధనం కూడా ఆదా అవుతుంది.

టాప్ గేర్‌లో నడపండి

టాప్ గేర్‌లో నడపడం వల్ల ఇంజన్‌పై తక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది.

ఎయిర్ కండిషన్‌ను బ్యాలెన్స్‌డ్‌గా ఉపయోగించండి

ఏసీని అధికంగా ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది. కాబట్టి సీజన్‌కు అనుగుణంగా దీన్ని ఉపయోగించండి.

Tags:    

Similar News