Car Tips And Tricks: మీ కారుపై గీతలు పడ్డాయా.. ఈ చిట్కాలతో సులభంగా తొలగించండి..!

Car Tips And Tricks: కారుపై గీతలు పడడం సర్వసాధారణమైన అంశం. కానీ దాన్ని రిపేర్ చేయడానికి వర్క్‌షాపుకు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.

Update: 2024-11-01 07:57 GMT

Car Tips And Tricks: మీ కారుపై గీతలు పడ్డాయా.. ఈ చిట్కాలతో సులభంగా తొలగించండి..!

Car Tips And Tricks: కారుపై గీతలు పడడం సర్వసాధారణమైన అంశం. కానీ దాన్ని రిపేర్ చేయడానికి వర్క్‌షాపుకు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల మీరు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ ఖర్చును తగ్గించుకొని రూ. 1000 నుంచి రూ.2000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు ఇంట్లోనే కారుపై గీతలను సరిచేయచ్చు. డబ్బును కూడా ఆదా చేయచ్చు. అయితే స్క్రాచ్ లోతుగా ఉంటే వర్క్‌షాపుకు కచ్చితంగా వెళ్లాలి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. కార్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఇన్‌స్టాల్ చేయండి

ఇది కారు పెయింట్‌ను గీతలు నుండి రక్షించే కవర్ లాంటిది. దీని ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ లాంగ్ రన్‌లో చూస్తే.. స్క్రీచ్ రిపేర్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

2. సిరామిక్ కోటింగ్

సిరామిక్ కోటింగ్ కారు పెయింట్‌పై ప్రొటక్షన్‌లా పనిచేస్తుంది. ఇది పెయింట్‌పై గీతలు, దుమ్ము ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది మీ కారును చాలా కాలం పాటు మెరుస్తూ ఉండేలా చేస్తుంది.

3. కారు కవర్

కారు ఉపయోగించనప్పుడు లేనప్పుడు మంచి నాణ్యత గల కవర్‌తో కప్పి ఉంచండి. ఇది దుమ్ము, పక్షి రెట్టలు, తేలికపాటి గీతలు నుండి రక్షణను అందిస్తుంది.

4. జాగ్రత్తగా పార్క్ చేయండి

తరచుగా పార్కింగ్ సమయంలో గీతలు ఏర్పడతాయి. పార్కింగ్ స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వీలైతే వాహనాన్ని ఖాళీ స్థలంలో పార్క్ చేయండి. ఇది గీతలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. స్క్రాచ్ రిమూవల్ కిట్

తేలికపాటి గీతలు కోసం స్క్రాచ్ రిమూవల్ కిట్‌లను అందుబాటులో ఉంచుకోండి. ఇది పాలిషింగ్ క్లాత్‌ను కలిగి ఉంటుంది. ఇది చిన్న గీతలు తొలగించడంలో సహాయపడుతుంది.

6. క్రమం తప్పకుండా వాష్, వాక్స్

కారును క్రమం తప్పకుండా కడగడం, వాక్సింగ్ చేయడం వల్ల దాని ఉపరితలం మృదువుగా ఉంటుంది. దుమ్ము, ఇతర కణాలు దానికి అంటుకోకుండా నిరోధిస్తుంది, ఇది గీతలు ఏర్పడవచ్చు.

Tags:    

Similar News