Gear and Clutch Combination: మీ కారు తక్కువ మైలేజ్ ఇస్తుందా.. అయితే గేర్-క్లచ్ ఇలా వాడండి..!

Gear and Clutch Combination: కారు మైలేజీని పెంచడానికి గేర్, క్లచ్ సరైన పద్ధతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం.

Update: 2024-11-02 07:34 GMT

Gear and Clutch Combination: మీ కారు తక్కువ మైలేజ్ ఇస్తుందా.. అయితే గేర్-క్లచ్ ఇలా వాడండి..!

Gear and Clutch Combination: కారు మైలేజీని పెంచడానికి గేర్, క్లచ్ సరైన పద్ధతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలా మంది తమకు తెలియకుండానే గేర్లు, క్లచ్‌లను తప్పుగా వాడడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మంచి మైలేజీని అందించడానికి గేర్, క్లచ్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

గేర్‌లను నెమ్మదిగా మార్చండి

గేర్‌ను మార్చే ప్రక్రియను సాఫీగా చేయడానికి ప్రయత్నించండి. ఎక్కువగా గేర్‌లను మార్చడం వల్ల ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది.

తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద గేర్‌లను మార్చండి

గేర్‌లను మార్చేటప్పుడు ఇంజన్ ఆర్‌పిఎమ్ గుర్తుంచుకోండి. 1500-2000 RPM మధ్య గేర్‌లను మార్చడం సరైన చర్య. దీని వల్ల ఇంజన్‌పై తక్కువ ఒత్తిడి పడుతుంది. అలానే ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తోంది.

హై గేర్‌లో క్లచ్ వాడకాన్ని తగ్గించండి

కారు టాప్ గేర్‌లో ఉన్నప్పుడు అనవసరంగా క్లచ్‌ని నొక్కడం మానుకోండి. ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది. గేర్‌లకు అవసరమైనప్పుడు మాత్రమే క్లచ్‌ని ఉపయోగించండి.

నెమ్మదిగా వేగాన్ని పెంచండి

వేగాన్ని ఒక్కసారిగా పెంచకండి. ఇలా చేయడం వల్ల ఇంజన్‌కు ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది. యాక్సిలరేటర్‌ని ఉపయోగించడం వల్ల నెమ్మదిగా ఇంధనం ఆదా అవుతుంది. మైలేజీ కూడా పెరుగుతుంది.

గేర్ ప్రకారం వేగాన్ని ఉంచండి

ప్రతి గేర్‌కు అనువైన వేగం ఉంటుంది. మొదటి గేర్‌లో 10-15 కిమీ/గం, రెండవది 20-30, మూడవది 30-40, నాల్గవది 40-50, ఐదవది 50-60 కిమీ/గం. ఇది ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచి ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు గేర్, క్లచ్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించవచ్చు. ఇది కారు మైలేజీని పెంచుతుంది. డ్రైవింగ్ అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Tags:    

Similar News