Affordable EVs under Rs 20 Lakh: రూ.20 లక్షల్లో బెస్ట్ కార్లు ఇవే.. సింగిల్ ఛార్జ్‌పై ఎక్కువ రేంజ్ అందిస్తాయి!
Affordable EVs under Rs 20 Lakh: మీరు పెట్రోల్-డీజిల్ కారుకు బదులుగా కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు అనుకూలంగా ఉండే రూ. 20 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కొన్ని గొప్ప వాహనాల లభిస్తాయి.
Affordable EVs under Rs 20 Lakh: మీరు పెట్రోల్-డీజిల్ కారుకు బదులుగా కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు అనుకూలంగా ఉండే రూ. 20 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కొన్ని గొప్ప వాహనాల లభిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఫుల్ ఛార్జ్‌తో డ్రైవింగ్ రేంజ్ 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ. రోజువారీ వినియోగంతో పాటు దూర ప్రయాణాలకు కూడా ఇవి సరిపోతాయి.
MG Windsor EV
మీరు సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే విండ్సర్ EV మీకు మంచి ఎంపిక. ఇది 38kWh LFP బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జ్‌పై 331 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కారు 136 హెచ్‌పి పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. MG Windorలో 135 డిగ్రీల రిక్లైన్ సీట్లు (ఏరో-లాంజ్ సీట్లు) ఉన్నాయి. ఈ కారు సీట్లు మీకు సినిమా హాల్ లేదా ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్నంత సౌకర్యాన్ని అందిస్తాయి. ఇందులో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.
భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ , డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ కారు డీసీ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 30 శాతం నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.50 లక్షల నుండి ప్రారంభమైనప్పటికీ బ్యాటరీ యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద, దీనిని కేవలం రూ. 10 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు.
MG ZS EV
ఎమ్‌జీ EV ఒక లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇందులో చాలా మంచి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థలం కొరత లేదు. దీని డిజైన్ చాలా ప్రీమియం. ఈ కారు ధర రూ.18.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది పూర్తి ఛార్జింగ్ పై 461 కిలోమీటర్ల వరకు ప్రయాణాన్ని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.
Tata Punch EV
టాటా మోటార్స్ చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పంచ్ EV ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 14.29 లక్షల వరకు ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌పై 300 కి.మీల పరిధిని అందిస్తోంద.. టాటా పంచ్ EV సిటీ డ్రైవ్‌కు మంచి ఆప్షన్‌గా ఉంటుందిి. ఈ వాహనంలో చాలా మంచి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
Tata Nexon EV
ఈ కారు భద్రతలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. మీరు దీన్ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో ఈ వాహనంపై కూడా చాలా మంచి ఆఫర్ ఉంది. ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.49 లక్షలు. మీరు రోజువారీ ఉపయోగం కోసం ఈ కారును ఉపయోగించవచ్చు. ఇది ఫుల్ ఛార్జింగ్ పై 300 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.