Big Car Discount: కార్లపై కళ్లుచెదిరే ఆఫర్లు.. ఒక్కోదానిపై లక్షల్లో డిస్కౌంట్లు
Big Car Discount: ప్రస్తుతం మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా కార్లపై మంచి తగ్గింపులు లభిస్తున్నాయి.
Big Car Discount: పండుగ సీజన్లో తమ అమ్మకాలను పెంచుకోవడానికి కార్ కంపెనీలు ప్రస్తుతం భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. దీని వల్ల నేరుగా కస్టమర్లు మాత్రమే లబ్ది పొందుతారు. అమ్మకాలు తక్కువగా ఉన్న కార్లపై కార్ల కంపెనీలు అత్యధిక డిస్కౌంట్లను ఇస్తున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా కార్లపై మంచి తగ్గింపులు లభిస్తున్నాయి. మీరు కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఏ కారుపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.
మారుతి జిమ్నీ
మారుతి సుజుకి ప్రస్తుతం తక్కువ సేల్స్‌లో ఎస్యూవీ ‘జిమ్నీ’పై మంచి తగ్గింపును అందిస్తోంది. తద్వారా అమ్మకాలు పెరుగుతాయి. జిమ్నీ అమ్మకాలు నిరంతరం పడిపోతున్నాయి. ఈ వాహనం పేలవమైన డిజైన్, అధిక ధరతో కూడిన డిజైన్ కారణంగా వినియోగదారులు దీనిని కొనడానికి ఆసక్తి చూపలేదు. మారుతి జిమ్నీ జీటా, ఆల్ఫా వేరియంట్లు వరుసగా రూ. 1.75 లక్షలు, రూ. 2.30 లక్షల తగ్గింపులను పొందుతున్నాయి.
ఇంజన్ గురించి మాట్లాడితే జిమ్నీ 1.5 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ని కలిగి ఉంది. ఇది ఒక లీటర్లో 16.94 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4 వీల్ డ్రైవ్‌తో వస్తుంది. ఇది సైజులో కాంపాక్ట్ అయినప్పటికీ దృఢంగా ఉంటుంది. ఇందులో స్పేస్ కూడా బాగుంది. మారుతీ సుజుకీ ఎంత డిస్కౌంట్ ఇచ్చినా అమ్మకాలు పెంచుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మీకు బడ్జెట్ సమస్యలు లేకుంటే మీరు జిమ్నీని పరిగణించవచ్చు.
మహీంద్రా థార్
మహీంద్రా థార్ 4×4 కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశం మీకు ఖచ్చితంగా ఉపయోగంగా ఉంటుంది. ఈ పండుగ సీజన్లో రూ. 1.25 లక్షల నగదు తగ్గింపు, రూ. 25,000 విలువైన టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనం ధర రూ.11.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ తగ్గింపు దాని 2 డోర్ మోడల్‌పై ఉంది.
టయోటా
టయోటా తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ పండుగ సీజన్లో టయోటా ఇన్నోవా క్రిస్టాపై రూ. 1 లక్ష వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. ఇది కాకుండా ఫార్చ్యూనర్ రూ. 1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 30,000 నగదు తగ్గింపు ప్రయోజనాన్ని కూడా పొందుతోంది.
ఇది కాకుండా ఫార్చ్యూనర్ లెజెండర్‌లో రూ. 75 వేల నగదు తగ్గింపు, రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్, అదనపు యాక్సెసరీస్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు టయోటా క్యామ్రీని కొనుగోలు చేస్తే ఈ కారుపై 5 సంవత్సరాల వారంటీతో పాటు రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50 వేల కార్పొరేట్ తగ్గింపు ఇస్తుంది.