Bike Tyre Care: ట్యూబ్ లెస్ లేదా ట్యూబ్.. మైలేజీ ఎక్కువగా రావాలంటే ఏది వాడాలో తెలుసా?

Bike Tyre Care: ప్రస్తుత కాలంలో టైర్ల టెక్నాలజీ కూడా మారింది. ఒకప్పుడు ట్యూబ్‌తో వచ్చే టైర్లు.. ఇప్పుడు అది లేకుండా వస్తున్నాయి.

Update: 2024-11-01 11:05 GMT

Bike Tyre Care: ట్యూబ్ లెస్ లేదా ట్యూబ్.. మైలేజీ ఎక్కువగా రావాలంటే ఏది వాడాలో తెలుసా?

Bike Tyre Care: ప్రస్తుత కాలంలో టైర్ల టెక్నాలజీ కూడా మారింది. ఒకప్పుడు ట్యూబ్‌తో వచ్చే టైర్లు.. ఇప్పుడు అది లేకుండా వస్తున్నాయి. వాటినే ట్యూబ్‌లెస్ టైర్లు అంటారు. వీటితో పాటు ట్యూబ్‌ను అందిచే టైర్లు సైతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా మదిలో ఓ ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే.. ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుందని. మీరు కూడా అదే అయోమయంలో ఉంటే ఈ రోజు దానికి ఫుల్‌స్టాప్ పెట్టేద్దాం. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

ముందుగా ట్యూబ్‌లెస్ టైర్లు గురించి తెలుసుకుందాం.

తేలికైన, సురక్షితమైనవి 

ట్యూబ్‌లెస్ టైర్లు తేలికగా ఉంటాయి. పంక్చర్ అయినప్పుడు త్వరగా గాలిని కోల్పోవు, కాబట్టి మీరు ఎక్కువసేపు నడపవచ్చు.

తక్కువ ప్రెసర్

వాటి డిజైన్, నిర్మాణం మెరుగైన గ్రిప్, తక్కువ రాపిడిని అందించే విధంగా ఉంటాయి. తద్వారా ఎక్కువ మైలేజీని అందిస్తాయి.

నిర్వహణ

ట్యూబ్‌లెస్ టైర్‌లకు తక్కువ నిర్వహణ అవసరం. ఎటువంటి సమస్యలు లేకుండా ఎక్కువసేపు డ్రైవ్ చేయచ్చు.

ఇప్పుడు ట్యూబ్డ్ టైర్లు వంతు

తక్కువ ఖర్చు

ట్యూబ్డ్ టైర్లు సాధారణంగా చౌకగా ఉంటాయి. కానీ వీటిని ఎక్కువ రోజులు ఉపయోగించడం ఖర్చులు ట్యూబ్‌లెస్ కంటే ఎక్కువగా ఉండవచ్చు.

పంక్చర్ సమయంలో ప్రమాదాలు

పంక్చర్ విషయంలో గాలి వెంటనే విడుదల అవుతుంది. దీని కారణంగా మీరు వెంటనే ఆపివేయాలి. ఇది ప్రయాణానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

కొన్ని బైక్‌లకు అనుకూలం

కొన్ని మోటార్‌సైకిల్ మోడల్‌లలో ట్యూబ్ టైర్లు మెరుగ్గా పని చేస్తాయి.

చివరగా మీరు ఎక్కువ మైలేజీని కోరుకుంటే ట్యూబ్‌లెస్ టైర్లు మంచి ఎంపిక. ఇవి ఎక్కువ కాలం ఉండేవి, సురక్షితమైనవి, మెరుగైన గ్రిప్ అందిస్తాయి.

Tags:    

Similar News