Car Buying Tips: కొత్త కారు కొంటున్నారా.. జీతం ప్రకారం ఏది బెస్ట్ అంటే..?
Car Buying Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కారు కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కారు అవసరం అధికంగా ఉంటుంది.
Car Buying Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కారు కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కారు అవసరం అధికంగా ఉంటుంది. అయితే కారు కొనడం కొంచెం ఖరీదైనదిగా చెప్పవచ్చు. భారతదేశంలో చౌకైన కారు దాదాపు రూ.5 లక్షలకు లభిస్తుంది. పైగా మార్కెట్‌లో కోట్లాది రూపాయల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎవరైనా కారు కొనడానికి సరైన బడ్జెట్‌ను తయారు చేయడం ముఖ్యం. కారు కొనుగోలు కోసం వార్షిక వేతనంలో 50% కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే అతను రూ.5 లక్షల లోపు కారును కొనుగోలు చేయవచ్చు. వార్షిక ఆదాయం రూ.10 కోట్లు అయితే అతను రూ.5 కోట్ల లోపు కారును కొనుగోలు చేయవచ్చు.
కారు కొనడానికి వార్షిక ఆదాయంలో 50% కంటే ఎక్కువ ఖర్చు చేస్తే తర్వాత ఇతర ఖర్చుల కోసం తక్కువ డబ్బు మిగిలి ఉంటుంది. ఈ కారణంగా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతారు. ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే కారు కోసం రూ.5 లక్షలు ఖర్చు చేయాలి. మిగతా రూ. 5 లక్షలు మిగిలిన అన్ని ఖర్చులకు సరిపోతాయి.
అదే సమయంలో మీరు వార్షిక ఆదాయంలో 50% కంటే ఎక్కువ కారును కొనుగోలు చేసి ఇతర ఖర్చులతో రాజీ పడకూడదనుకుంటే రుణం తీసుకోవలసి వస్తుంది. దీనివల్ల ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలి. కారు విలువ తగ్గే ఆస్తి కాబట్టి కాలక్రమేణా విలువ తగ్గుఉంది. రుణభారం వల్ల మీరు ఇబ్బందుల్లో పడుతారు. ఇలాంటి సమయంలో వార్షిక ఆదాయంలో 50% వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ల జాబితాను రూపొందించుకొని అవసరాలకు అనుగుణంగా కారును ఎంచుకోవాలి.