Tilak Benefits: బొట్టు పెట్టుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే షాక్‌ అవుతారు..!

Tilak Benefits: భారతీయ సంస్కృతిలో బొట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా అందరికి బొట్టు పెట్టి ప్రారంభిస్తారు.

Update: 2023-09-25 14:30 GMT

Tilak Benefits: బొట్టు పెట్టుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే షాక్‌ అవుతారు..!

Tilak Benefits: భారతీయ సంస్కృతిలో బొట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా అందరికి బొట్టు పెట్టి ప్రారంభిస్తారు. ఆచార సంప్రదాయాలలో మాత్రమే కాదు శాస్త్రీయ దృక్కోణంలో కూడా బొట్టుకు చాలా విలువ ఉంది. ఇది శరీరానికి సంబంధించిన చక్రాలను సక్రియం చేయడంలో సహాయపడుతుంది. బొట్టు పెట్టుకునే వ్యక్తులు ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపవుతుంది. మానసిక ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే వివిధ గ్రహాల స్థానాలను బట్టి బొట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. బొట్టు గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గ్రహాల స్థానాల ఆధారంగా బొట్టు

బొట్టు శరీరంలోని ఏడు చక్రాలను సక్రియం చేస్తుంది. ఇది వ్యక్తి నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పెంచుతుంది. గ్రహాల స్థితిని బట్టి బొట్టు పెటుకుంటే జీవితంలో మంచి జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడిని బలోపేతం చేయడానికి ఎర్రటి బొట్టు పెట్టుకోవాలి. చంద్రుడిని బలోపేతం చేయడానికి తెల్ల చందనం బొట్టు, కుజుడు బలపడాలంటే కుంకుమ బొట్టు, బుధ గ్రహాన్ని బలోపేతం చేయడానికి అష్టగంధ బొట్టు, గురు గ్రహం బలపడాలంటే కుంకుమ బొట్టు, శుక్ర గ్రహాన్ని బలోపేతం చేయడానికి కుంకుమ బొట్టు, శని, రాహు, కేతువులను బలపరచడానికి భస్మాన్ని పెట్టుకోవాలి.

బొట్టు పెట్టే పద్దతి

బొట్టు ఒక పద్దతి ప్రకారంగా పెట్టాలి. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ముందుగా అక్కడ ఉన్న పెద్దలకు పెట్టాలి. ఇంట్లో అయితే ముందుగా తండ్రికి పెట్టిన తర్వాత అందరికి పెట్టాలి. స్నానం చేయకుండా బొట్టు పెట్టుకోకూడదు. పూజ గదిలో దేవతల ఫొటోలకు ఉంగరపు వేలిని ఉపయోగించి బొట్టు పెట్టాలి. ఇతర వ్యక్తులకు బొటనవేలు ఉపయోగించి బొట్టు పెట్టాలి. మత విశ్వాసాల ప్రకారం బొట్టు పెట్టిన తర్వాత 3 గంటలు నిద్రపోకూడదు. పురుషులు పొడవైన తిలకం, స్త్రీలు వృత్తాకారంగా బొట్టు పెట్టుకోవాలి.

Tags:    

Similar News