Horoscope Today in Telugu 7th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Horoscope Today in Telugu 7th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Update: 2024-09-07 00:30 GMT

Horoscope Today in Telugu 7th September 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

(07-09-2024 – శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : చవితి సాయంత్రం గం.5.37 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: చిత్త మధ్యాహ్నం గం.12.34 ని.ల వరకు ఆ తర్వాత స్వాతి

అమృతఘడియలు: రేపు తె.వా. గం.5.38 ని.ల నుంచి గం.7.26 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.51 ని.ల నుంచి రాత్రి గం.8.39 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.6.03 ని.ల నుంచి గం.7.42 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.9.09 ని.ల నుంచి గం.10.41 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.03 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.25 ని.లకు

మేషం : 


పనులు సఫలమవుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలుంటాయి. ప్రయాణం లాభిస్తుంది. మీ నిజాయితీకి తగ్త గుర్తింపు లభిస్తుంది.

వృషభం :


 వాదప్రతివాదనల్లో పైచేయి సాధిస్తారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. మిత్రుల తోడ్పాటుతో బలహీనతలను జయిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. అదృష్టం తోడుగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మిథునం :


 పనుల్లో ఆటంకాలుంటాయి. బద్ధకిస్తే ఇబ్బంది తప్పదు. ఆర్థిక లావాదేవీల్లో అభీష్టం నెరవేరదు. సమర్థతకు పరీక్షాకాలం. అత్యంత నేర్పుగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విలువైన వస్తువులు జాగ్రత్త.

కర్కాటకం:


 బుద్ధి నిలకడగా ఉండదు. ఆత్మీయులతోనూ విరోధం ఏర్పడుతుంది. తొందరపాటు వల్ల నష్టం వస్తుంది. వృథా ఖర్చులను తగ్గించాలి. ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగవు. అవమానాలకు ఆస్కారం ఉంది.

సింహం :


 ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు తోడుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య :


ఇతరుల కారణంగా మాట పడాల్సి వస్తుంది. అకారణ విరోధం గోచరిస్తోంది. ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారం ఉంది. జీవత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఎవరికీ పూచీకత్తును ఇవ్వకండి. ఆరోగ్యం జాగ్రత్త.

తుల :


 అన్ని రంగాల్లోని వారికీ అనువైన రోజు. వ్యక్తిగత పనులపై శ్రద్ధ పెడతారు. ధనలాభముంది. మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది. కీర్తి పెరుగుతుంది. అదృష్టం వరిస్తుంది.

వృశ్చికం :


తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వృథా ఖర్చులను తగ్గించండి.

ధనుస్సు :


 అన్ని కార్యాలూ సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు అనువుగా ఉంటాయి. రుణ ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది. సంతాన వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. మిత్రుల వల్ల లబ్ది పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.

మకరం :


 అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభంగాఉంటుంది. సమర్థతకు గుర్తింపు వస్తుంది.

కుంభం :


వ్యవహారాలు సవ్యంగా సాగవు. ఆటంకాలు ఎదురవుతాయి. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్యాప్రయత్నాలు ఫలించవు. వృథా ఖర్చులు ఉంటాయి.

మీనం :


ఇష్టం లేని పని చేయాల్సి రావడం ఆవేదనను కలిగిస్తుంది. దురభిప్రాయాలు ఏర్పడతాయి. తగాదాలకూ ఆస్కారం ఉంది. అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరవు. వారసత్వ ఆస్తి వ్యవహారాలు నెమ్మదిస్తాయి.


Full View


Tags:    

Similar News