Telugu Horoscope Today 9th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా
Telugu Horoscope Today 9th september 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా
(09-09-2024 – సోమవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం
తిధి : షష్ఠి రాత్రి గం.9.53 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి
నక్షత్రం: విశాఖ సాయంత్రం గం.6.04 ని.ల వరకు ఆతర్వాత అనూరాధ
అమృతఘడియలు: ఉదయం గం.8.20 ని.ల నుంచి గం.10.06 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.10.24 ని.ల నుంచి అర్ధరాత్రి గం. 12.08 ని.ల వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.38 ని.ల నుంచి గం.1.27 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.06 ని.ల నుంచి గం.3.55 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.7.36 ని.ల నుంచి గం.9.08 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 6.03 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం. 6.23 ని.లకు
మేషం :
బలహీనతను బయటపెట్టకండి. ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. అపోహలు ఏర్పడతాయి. తగాదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ప్రమాదాలకు ఆస్కారం ఉంది.
వృషభం :
ఆకాంక్ష నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కొత్త విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
మిథునం :
మనో నిబ్బరం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకుంటారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. బంధువులను కలుస్తారు.
కర్కాటకం:
సొంత తెలివితేటలు ఫలించవు. ఇష్టకార్యం చెడిపోతుంది. అనుమానాలు వీడి కష్టపడాలి. సంతానం తీరు చికాకు పెడుతుంది. అనవసర ఖర్చులను తగ్గించండి. ఆరోగ్యం జాగ్రత్త. విరోధాలకు దూరంగా ఉండండి.
సింహం :
పనులు అనుకున్నరీతిలో సాగవు. డబ్బుకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తల్లి వైపు బంధువుల గురించిన వర్తమానం వస్తుంది. ఇరుగుపొరుగుతో సంబంధాలు బెడిసికొట్టే వీలుంది.
కన్య :
ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మిత్రుల వల్ల లబ్దిని పొందుతారు.
తుల :
పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. మనసులోని మాటను సవ్యంగా చెప్పలేక ఇబ్బందుల్లో పడతారు. ప్రత్యర్థుల వల్ల సమస్యలొస్తాయి. శివుడిని పూజిస్తే మేలు కలుగుతుంది.
వృశ్చికం :
తెలివితేటలతో పనులను పూర్తి చేస్తారు. ధనలాభం ఉంది. పరిస్థితులపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బాల్యస్నేహితులతో విందులో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు :
పనులు సవ్యంగా సాగవు. ఆర్థికంగానూ ఇబ్బంది ఉంటుంది. అవసరాల కోసం అప్పు చేయాల్సి వస్తుంది. వేళకు భోజనం, సరైన నిద్ర ఉండవు. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త.
మకరం :
ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మనశ్శాంతిని పొందుతారు. ఆనందంగా గడుపుతారు.
కుంభం :
యోగదాయకమైన రోజు. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగులు పైఅధికారుల ప్రశంసలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రత్యర్థులపై పైచేయిని సాధిస్తారు.
మీనం :
పనుల్లో జాప్యం ఉంటుంది. అవసరమైన మేర డబ్బు అందుతుంది. సంతానంతో విభేదిస్తారు. మనశ్శాంతి కరువవుతుంది. ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.