Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (మార్చి 16 - మార్చి 22)

Weekly Horoscope in Telugu 2025 March 16 to March 22: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Update: 2025-03-16 02:04 GMT
Weekly Horoscope

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (మార్చి 16 - మార్చి 22)

  • whatsapp icon

Weekly Horoscope in Telugu 2025 March 16 to March 22: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

అభీష్టం నెరవేరుతుంది. సంబంధ, బాంధవ్యాలు మెరుగవుతాయి. స్వేచ్ఛను ఇష్టపడతారు. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. ధన సంబంధ విషయాల్లో లాభాన్ని పొందుతారు. ప్రయాణాలు కలిసొస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు శుభప్రదంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. వారసత్వపు వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ఇతరులపై చెడు అభిప్రాయం కలిగే సూచన ఉంది. కోపాన్ని తగ్గించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కీళ్ల సంబంధమైన సమస్యకు ఆస్కారముంది.

పరిహారం: శ్రీదత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం

శుభ ఫలితాలుంటాయి. ధనలాభం ఉంది. స్వస్థానప్రాప్తి గోచరిస్తోంది. సంతానం కోరుకునే వారికి శుభవార్త అందే వీలుంది. మనోవేదన తీరుతుంది. బంధు,మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. భాగస్వాములు అమితంగా గౌరవిస్తారు. న్యాయవివాదాలు పరిష్కారమవుతాయి. అదృష్టం వరిస్తుంది. కొత్తవారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. అవసరం లేకున్నా పోటీల్లో పాల్గొనకండి. ఖర్చులను అదుపు చేయండి. ఉద్రేకం మంచిది కాదు. జీర్ణ సమస్య వస్తుంది.

పరిహారం: నవగ్రహాలను పూజించండి. నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

ఆర్థిక స్థితి మెరుగవుతుంది. పోటీదారుల బెడద తగ్గుతుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి తోడ్పాటు మనో ధైర్యాన్ని పెంచుతుంది. సంతానం పొందేందుకు అనువైన కాలమిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. మనసు తేలికపడుతుంది. పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. అనారోగ్యం, గాయాల నుంచి తేరుకుంటారు. ప్రయాణాలు లాభదాయంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమర్థతకు తగ్గ గుర్తింపు లభించదు. నిరాశ పడకండి. గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: శ్రీ పార్వతీపరమేశ్వరులను ఆరాధించండి. గోధుమరంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు. అవసరమైన మేరకు డబ్బు సమకూరుతుంది. రుణ సంబంధ యత్నాలు కొలిక్కి వస్తాయి. అడ్డంకులను అధిగమిస్తారు. న్యాయపరమైన వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో నష్టపోయే సూచన ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు చికాకు పెడతాయి. తెలివితేటలకు సరైన గుర్తింపు ఉండదు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

పరిహారం: శ్రీ గాయత్రీమాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను పూజించండి.

సింహం

కీలక సమయాల్లో చూపే తెగువ, ధైర్యసాహసాలు, తగిన ప్రయోజనాన్నిస్తాయి. వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంతో వినోదంగా గడుపుతారు. సోదరులు సర్వదా తోడుగా నిలుస్తారు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న శుభసమాచారం ఈవారం అందుతుంది. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనుకూలం. ప్రయాణం లాభిస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అనవసర గొడవల కారణంగా, జీవితపు గుట్టు రట్టయ్యే వీలుంది. స్థిరాస్తి, విద్య, సేవా రంగాల్లోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవమానాలకు ఆస్కారముంది.

పరిహారం: శ్రీలక్ష్మీనారాయణులను పూజించండి. ముదురు నీలపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కన్య

చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విశేష లాభముంటుంది. అన్నివైపులా శుభ ఫలితాలు లభిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. ఆధ్యాత్మిక అంశాలు ఆకర్షిస్తాయి. తోబుట్టువుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఎవరికీ పూచీకత్తుగా ఉండకండి. ఇతరుల వల్ల ఇబ్బంది పడతారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఆస్తి వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది.

పరిహారం: శ్రీ గౌరీదేవిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

వ్యవహారాలు ఆశించినట్లుగానే సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షకు పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంతో వినోదంగా గడుపుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు శుభం చేకూరుస్తాయి. బాల్యమిత్రులను కలుస్తారు. దాయాదులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. దైవ సంబంధ అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. కీలక వర్తమానం ఆనందాన్ని పెంచుతుంది. మాట తప్పడం వల్ల ఇబ్బంది పడతారు. అనవసర విషయాల్లో జోక్యం వల్ల చిక్కుల్లో పడతారు.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. మెరూన్ రెడ్ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

కార్యసాధనలో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సరదాగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. కీలక బాధ్యత నుంచి తప్పుకుంటారు. దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. మిత్రుల వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం వల్ల సమస్యల్లో పడతారు. కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి.

పరిహారం: శ్రీకనకదుర్గ అమ్మవారిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశించిన లబ్దిని పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ప్రత్యర్థుల బెడద తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. సంతాన సంబంధ వినోదసౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. కీలక వ్యవహారంలో అదృష్టం వరిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. బాల్య మిత్రులను కలుస్తారు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ఒంటరిగా గడిపే సూచన ఉంది.

పరిహారం: శ్రీ శనైశ్చరుడిని పూజించండి. నలుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం

అభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన పనులన్నింటా అనుకూల ఫలితాలుంటాయి. సామర్థ్యాన్ని పెంచుకుంటారు. వృత్తిపరమైన పురోగతి ఉంటుంది. ప్రత్యర్థులను జయిస్తారు. సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. రుణ విముక్తి యత్నాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించినట్లే ఉంటాయి. పెద్దల ఆశీస్సులను పొందుతారు. దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

పరిహారం: శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం

యోగదాయకమైన వారమిది. ప్రయత్నించిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. అన్ని రకాల పోటీల్లో విజేతగా నిలుస్తారు. ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు, అధికారుల ప్రశంసలు, రివార్డులను పొందుతారు. నైపుణ్యానికి తగ్గ కొత్త బాధ్యత స్వీకరించే సూచన ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కుటుంబంతో వినోదంగా గడుపుతారు. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. సంతాన సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. తండ్రితో సఖ్యత పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు.

పరిహారం: శ్రీమహాగణపతిని పూజించండి. ముదురు ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

వృత్తిపరమైన నైపుణ్యంతో పైవారిని మెప్పిస్తారు. సమర్థతకు తగ్గ బాధ్యత లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అవసరమైన మేర డబ్బు సమకూరుతుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. దూర ప్రదేశాలో స్థిర నివాస యత్నాలు చేస్తారు. ఆస్తి క్రయవిక్రయాల్లో జాగ్రత్త. కొన్నిసార్లు ఇష్టంలేని పనిని చేయాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వాహనాలపై దుందుడుకుగా వ్యవహరించకండి. ఎముకలకు ఇబ్బంది ఏర్పడుతుంది.

పరిహారం: శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి. 

Tags:    

Similar News