Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (15/3/2025)

Daily Horoscope Today In Telugu, March 15, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

Update: 2025-03-14 22:18 GMT
Daily Horoscope Today

Daily Horoscope Today

  • whatsapp icon

Daily Horoscope Today In Telugu, March 15, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, కృష్ణ పక్షం

తిధి: పాడ్యమి మధ్యాహ్నం గం.2.33 ని.ల వరకు ఆ తర్వాత విదియ

నక్షత్రం: ఉత్తర ఉదయం గం.8.54 ని.ల వరకు ఆ తర్వాత హస్త

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటాక రేపు తె.వా.గం.5.02 ని.ల నుంచి గం.6.50 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.18 ని.ల నుంచి రాత్రి గం.8.05 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.24 ని.ల నుంచి గం.8.00 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.00 ని.ల నుంచి గం.10.30 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం.6.24 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.26 ని.లకు

మేషం 

అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. వ్యవహార జయం ఉంది. ఆర్థిక లావాదేవీల్లోనూ లాభపడతారు. పోటీల్లో గెలుస్తారు. గౌరవం పెరుగుతుంది. అన్ని సందర్భాల్లో మిత్రులు తోడుగా నిలుస్తారు. విందులో పాల్గొంటారు.

వృషభం 

బద్ధకాన్ని వదిలి పెట్టాలి. పనుల పూర్తికి బాగా శ్రమించాలి. ఆదాయానికి మించిన ఖర్చుంటుంది. సమర్థతకు తగిన గౌరవముండదు. అనుమానాలను వీడి పనిచేయండి. ప్రేమ వ్యవహారంలో ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్త.

మిథునం 

స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యవహారాలు అనుకూలంగా సాగవు. మనసు నిలకడగా ఉండదు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. అనవసర విరోధం గోచరిస్తోంది. తొందరపాటు వద్దు.

కర్కాటకం

ముఖ్యమైన సమాచారం అందుతుంది. ధన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. బాధ్యతల నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. దాయాదులతో సఖ్యత ఏర్పడుతుంది.

సింహం 

అనుకున్న రీతిలో పనులు సాగవు. మానసిక అశాంతికి గురవుతారు. ఆస్తి క్రయవిక్రయాలు అనుకూలించవు. ధననష్టముంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. నింద భరించాల్సి వుంటుంది. అనవసర జోక్యం వద్దు.

కన్య 

చక్కటి తెలివితేటలతో రాణిస్తారు. అదృష్టం తోడుగా నిలుస్తుంది. ధనలాభముంది. గృహావసరాలు తీరుస్తారు. కుటుంబంతో వినోదంగా గడుపుతారు. అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.

తుల 

వ్యవహారాల్లో నష్టపోతారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. న్యాయపరమైన వివాదాల్లో జాగ్రత్త. ప్రయాణాలు లాభసాటిగా ఉండవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. నిద్రలేమి వేధిస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది.

వృశ్చికం 

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సేవారంగంలోని వారికి అనుకూల ఫలితాలుంటాయి. ఇతరుల నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. పోటీల్లో ప్రత్యర్థులను జయిస్తారు.

ధనుస్సు 

అభీష్టం నెరవేరుతుంది. అన్ని పనులూ సఫలమవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. పెద్దల నుంచి అవసరమైన తోడ్పాటు లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.

మకరం 

భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. ఆర్థికంగానూ చికాకులుంటాయి. ఆత్మీయులతో విరోధం గోచరిస్తోంది. బలహీనతలను జయించాలి. గురు సమానమైన వ్యక్తులను కలుస్తారు .

కుంభం 

రోజు కష్టంగా గడుస్తుంది. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. అనుకున్న రీతిలో పనులు సాగవు. ఇష్టంలేని పనిని చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలి. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకు పెడతాయి.

మీనం 

వ్యవహారాలు శుభప్రదంగా ఉంటాయి. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ర్థిక లబ్దిని పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం ఉంది. మానసిక, శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. 

Tags:    

Similar News